[ad_1]
ICICI-Videocon Loan Case: ఐసీఐసీఐ బ్యాంక్ – వీడియోకాన్ గ్రూప్ మధ్య జరిగిన అక్రమ లోన్ల మంజూరు వ్యవహారంలో అరెస్టయిన వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్ (Venugopal Dhoot) వేసిన పిటిషన్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం (జనవరి 5, 2023) కొట్టివేసింది.
జైల్లో ఉన్నా, తమకు ప్రత్యేక సదుపాయాలు కావాలంటూ చందా కొచ్చర్ (Chanda Kochar), ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను (Deepak Kochhar) చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తిరస్కరించింది. తమ ఇంటి నుంచి ఆహారం, మంచాలు, పరుపులు, కుర్చీలు తెప్పించుకుని వినియోగించుకుంటామని కొచ్చర్ దంపతులు తమ పిటిషన్లో కోరారు. అలాంటివి అనుమతించేందుకు వీలు పడదంటూ, కొచ్చర్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఇంటి నుంచి ఆహారానికి బదులుగా, వైద్య అధికారిని సంప్రదించి వారికి సమతుల ఆహారం అందించాలని జైలు అధికారులను సీబీఐ కోర్టు ఆదేశించింది.
ధూత్ అప్రూవర్‌గా మారతారని అనుమానం
రుణం మంజూరు కేసులో వేణుగోపాల్ ధూత్‌ను చట్ట వ్యతిరేకంగా అరెస్టు చేశారంటూ ఆయన తరపు న్యాయవాదులు ఎస్ఎస్ లడ్డా, విరాల్ బాబర్ CBI కోర్టులో వాదించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధూత్ అప్రూవర్‌గా మారే ప్రమాదం ఉందని కొచ్చర్ దంపతులు భయపడ్డారని అన్నారు. కొచ్చర్ దంపతుల రిమాండ్‌లో తొలి విచారణ జరిగినప్పుడు, వేణుగోపాల్ ధూత్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కొచ్చర్ల తరపు న్యాయవాది ప్రశ్నించిన విషయాన్ని ఎస్ఎస్ లడ్డా గుర్తు చేశారు. కొచ్చర్ దంపతుల అరెస్ట్ తర్వాత, కేసు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి వచ్చిందని న్యాయస్థానంలో ఆరోపించారు.
ఈ కేసులో వేణుగోపాల్ ధూత్‌ను చట్ట వ్యతిరేకంగా అరెస్టు చేశారన్న అడ్వకేట్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. వేణుగోపాల్ ధూత్ చేసిన ఫిర్యాదులో వాస్తవాలు లేవంటూ, ధూత్ దరఖాస్తును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఆర్ పుర్వార్ కొట్టి వేశారు.
News Reels
జ్యుడీషియల్ కస్టడీలో ముగ్గురు నిందితులు
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ గ్రూప్‌నకు అక్రమ పద్ధతిలో రుణాలు మంజూరు చేశారంటూ, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ MD & CEO చందా కొచ్చర్‌ను, ఈ కేసులో అక్రమంగా లబ్ధి పొందిన ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను, 2022 డిసెంబర్ 23న CBI అధికారులు అరెస్టు చేశారు. 3 రోజుల తర్వాత ధూత్‌ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
కేసు ఏంటి?
బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను ఉల్లంఘించి… వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని CBI ఆరోపించింది. దీనికి ప్రతిగా… ధూత్ 2010 నుంచి 2012 మధ్య దీపక్ కొచ్చర్ కంపెనీలో రూ. 64 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో… అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సహా భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద ఒక FIRను CBI నమోదు చేసింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌తో పాటు… దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్ రెన్యూవబుల్స్ (NRL), సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కూడా నిందితులుగా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
[ad_2]
Source link