[ad_1]
ఏ పిండి..
చాలా మంది రోటీ చేసేందుకు మార్కెట్లో దొరికే ఏవేవో పిండిలను వాడుతుంటారు. అయితే, గోధుమలతో వచ్చే పిండి బెస్ట్ ఆప్షన్. ఇది దుకాణాల్లో దొరికే పిండి కంటే బాగుంటుంది.
Also Read : TB Symptoms : వీరికే ఎక్కువగా టీబి వస్తుందట..
పిండి కలపడం..
పెద్ద గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. నెమ్మదిగా నీరు పోస్తూ కలపండి. గోరువెచ్చని నీరు వాడితే చపాతీలు మృదువుగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం నీటిని ఒకేసారి వేయడం వల్ల జారుడుగా అవుతుంది. అవసరాన్ని బట్టి పోయండి. చేతులతో ఒత్తుతూ పిండిలా చేయండి. అవసరం అనుకుంటే చేతులపై కొన్ని నీరు పోసి తడుపుతూ మెత్తగా పిండిని నొక్కండి. ఈ పిండిని కలపడంలోనే ఉంటుంది మ్యాజిక్ అంతా. పిండి ఇప్పుడు వేలితో లోపలికి వెళ్ళేలా చూసుకోండి.
పిండిని పక్కన పెట్టడం..
తయారైన పిండిపై తడిగుడ్డ కానీ, ప్లాస్టిక్ ర్యాప్ కానీ, కప్పి కనీసం 15 నుంచి 30 నిమిషాల వరకూ పక్కన పెట్టుకోండి. అప్పుడే అది గ్లూటెన్ని రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత పిండిని తీసి మరోసారి నొక్కి కొద్దిగా నూనె వేసి మృదువులా అయ్యేలా మరోసారి కలపండి.
చపాతీలు చేయడం..
తయారైన పిండిని ముద్దల్లా చేసి చపాతీ తయారు చేసే చెక్కపై కొద్దిగా పిండి చల్లి డస్టింగ్లా చేసి పిండి ముద్దల్ని పెట్టి చపాతీల్లా నొక్కండి. గుండ్రంగా తిప్పుతూ చక్కగా చపాతీలను చేయండి. అవసరం అనుకుంటే నెయ్యిని రాయండి.
Also Read : ఇలాంటి వారినే పెళ్ళి చేసుకోండి.. జీవితమంతా హ్యాపీనే..
కాల్చడం
ముందుగా తవా పెట్టి వేడి చేయండి.
ఇప్పుడు చపాతీకి ఉన్న ఎక్స్ట్రా పిండి దులిపి వేడి పెనంపై వేయండి. ఓ వైపు కాస్తా రంగు మారి చిన్నచిన్నగా కాలగానే మరోవైపుకి తిప్పండి. కొద్దిగా ఆయిల్, నెయ్యి అప్లై చేసి నిదానంగా చపాతీ మొత్తం ఉడికేలా కాల్చండి.
Also Read : ఇలాంటి వారినే పెళ్ళి చేసుకోండి.. జీవితమంతా హ్యాపీనే..
పుల్కా కాల్చడం..
తయారైన చపాతీలను ముందుగా పెనంపై వేసి కాల్చాక మరోవైపుకి తిప్పాలి. ఈ వైపుని కూడా కాస్తా కాలాక వెంటనే దాన్ని నేరుగా స్టౌపై పెట్టి కాల్చండి. మెల్లిగా చేతి వేళ్ళతో కాని, పూరీలను నూనె నుంచి తీసే పటకారని వాడొచ్చు. అయితే, నూనె వేల్చి పెనంపై కాల్చితే చపాతీలు అని, నూనె వేయకుండానే స్టౌపై కాల్చిన వాటిని పుల్కాలు అని అంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇలా చిన్న చిన్న స్టెప్స్ పాటిస్తే చపాతీలు, పుల్కాలను మృదువుగా వస్తాయి.
[ad_2]
Source link