Monday, November 29, 2021
Array

చిత్తూరు, గుంటూరు ఏకగ్రీవాల వెనుక- జగన్‌, పెద్దిరెడ్డి ప్రతిష్ట ? అందుకేనా ఎస్ఈసీ బ్రేక్‌


చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తొలి విడత పంచాయతీ పోరుకు రంగం సిద్దమవుతుండగా.. అంతకు ముందే పలు జిలాల్లో అధికార పార్టీకి మద్దతుగా ఏకగ్రీవాలు జరిగాయి. ప్రభుత్వం కూడా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న వేళ ఇదంతా సాధారణమే అనుకున్నా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో గుంటూరు జిల్లాలోని తెనాలి రెవెన్యూ డివిజన్‌లో 337 పంచాయతీలు, 3442 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిలో 67 పంచాయతీలు 1337 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన 67 సర్పంచ్‌ అభ్యర్ధుల్లో 63 వైసీపీ వారే. అలాగే చిత్తూరు జిల్లాలో 545 పంచాయతీలకు 112 ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 95 వైసీపీకే దక్కాయి.

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ విచారణ

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ విచారణ

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవంగా మారిన నేపథ్యంలో వాటిపై విచారణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ విచారణకు ఆదేశించారు. అప్పటివరకూ సదరు పంచాయతీల ఫలితాలను నిలిపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆయా పంచాయతీల్లో ఏకగ్రీవాలపై విచారణ జరుగుతోంది. ఇందులో అధికారులు సహకరించినట్లు తేలితే వారిపైనా చర్యలు తప్పవని ఎస్ఈసీ హెచ్చరికలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ పంచాయతీల్లో ఏకగ్రీవాలు కరెక్టేనని చెబితే ఎస్‌ఈసీ ఏమంటారో, కాదని చెబితే ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. అందుకే జాగ్రత్తగా ఏకగ్రీవాలను విశ్లేషించే పనిలో వారు నిమ్మగ్నమయ్యారు.

అధికారులకు సర్కారు హెచ్చరికలు

అధికారులకు సర్కారు హెచ్చరికలు

పంచాయతీ పోరులో చిత్తూరు, గుంటూరు జిల్లాలో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై ఎస్ఈసీ అధికారులతో విచారణ ప్రారంభంచిన తరుణంలో రిటర్నింగ్‌ అధికారులైన కలెక్టర్లకు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది. ఎస్ఈసీ మాట విని ఏకగ్రీవాలపై ఏకపక్ష చర్యలు తీసుకుంటే నిమ్మగడ్డ రిటైర్‌ అయ్యాక మీపై చర్యలు తప్పవంటూ పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి బహిరంగంగానే వారిని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారబోతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే ఇప్పుడే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటారు, వినకపోతే ప్రభుత్వం తర్వాత చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారుల పాత్ర కీలకంగా మారింది.

జగన్, పెద్దిరెడ్డి కోసమేనా ఏకగ్రీవాలు ?

జగన్, పెద్దిరెడ్డి కోసమేనా ఏకగ్రీవాలు ?

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన భారీ ఏకగ్రీవాల వెనుక ప్రభుత్వ పెద్దల ప్రతిష్ట ముడిపడి ఉందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ నివాసంతో పాటు క్యాంప్‌ ఆఫీసు కూడా ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాను మంత్రి పెద్దిరెడ్డి తన కనుసన్నల్లో ఉంచుకున్నారు. అక్కడ పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఏమీ జరగదనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో పంచాయతీ పోరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం జగన్‌, పెద్దిరెడ్డి తమ జిల్లాల్లోనూ ఇతర జిల్లాల తరహాలోనే పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోలేకపోతే తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించారా లేక వైసీపీ నేతలే అలా ఊహించుకుని ఏకగ్రీవాలకు పావులు కదిపారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద జగన్‌, పెద్దిరెడ్డి కోసమే ఈ పంచాయతీల్లో అత్యధికం ఏకగ్రీవం అయిందన్న ప్రచారం సాగుతోంది.Source link

MORE Articles

చంద్రబాబు ఇలాకాలో జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ : సీఎం అంటూ నినాదాలు-హంగామా : వెనుక ఉన్నదెవరు..!!

జూనియర్ ఎన్టీఆర్ వర్సస్ టీడీపీ నేతలు ఆ తరువాత జరిగిన పార్టీ మహానాడు వేదికల పైనా జూనియర్ కనిపించారు. కానీ, పార్టీలో లోకేశ్ ప్రమేయం పెరిగే కొద్దీ...

Yellowstone Season 4 Episode 4 Recap: There’s no peace in this place

Major spoilers follow for Yellowstone episodes 1 to 4. Turn back now if you’re not caught up.There was something inert about last week’s...

MacBook Pro Cyber Monday Deal 2021: Cheapest Price Today | Digital Trends

The best Cyber Monday deals are here to upgrade your tech into the next tier of products you couldn’t afford during the rest...

What is Quick Charge? How does Qualcomm’s fast charging protocol work?

Robert Triggs / Android AuthorityWith smartphone battery capacities increasing alongside the introduction of more power-hungry hardware, fast charging on modern-day smartphones has become...

GameStop’s best early Cyber Monday deals: games, accessories, and more

GameStop’s starting to launch its Cyber Monday sales, featuring huge savings on digital and physical copies of games, gaming keyboards, and...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe