Tuesday, May 24, 2022

చెన్నైఎయిర్ పోర్టు వద్ద కిడ్నాప్ -మహారాష్ట్ర అడవుల్లో సజీవదహనం -జార్ఖండ్ నేవీ ఉద్యోగి దారుణహత్య


వారం కిందటే నిశ్చితార్థం..

జార్ఖండ్ లోని పాలము జిల్లా, కొల్హావ్ గ్రామానికి చెందిన 26ఏళ్ల సూరజ్ కుమార్ దుబే ఇండియన్ నేవీలో సాయిలర్. విదుల్లో భాగంగా కోయంబత్తూరు(తమిళనాడు)లోని ఐఎన్ఎస్ అగ్నిలో పనిచేస్తున్నాడు. సెలవులపై ఇంటికి వెళ్లిన సూరజ్ కు గత వారమే నిశ్చితార్థం జరిగింది. మార్చిలో ముహుర్తాలు పెట్టుకున్నారు. సెలవులు ముగియడంతో తిరిగి కోయంబత్తూరు వెళ్లేందుకుగానూ, జనవరి 31న రాంచీ నుంచి చెన్నైకి విమానంలో వచ్చేశాడు. రాత్రి 9 గంటల సమయంలో..

 చెన్నలో కిడ్నాప్.. 1500 ప్రయాణం..

చెన్నలో కిడ్నాప్.. 1500 ప్రయాణం..

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎయిర్ పోర్టు నుంచి కోయంబత్తూరు వాహనాల కోసం వెళుతోన్న క్రమంలో.. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు దూబేను అపహరించారు. దాదాపు మూడు రోజుల పాటు చెన్నైలోనే గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో దుబేను ఖతం చేయాలనుకున్న దుండగులు ఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించారు..

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం

మహారాష్ట్ర తీరంలో సజీవదహనం..

మహారాష్ట్ర తీరంలో సజీవదహనం..

నేవీ అధికారి దుబే నుంచి డబ్బులు లాగడం సాధ్యం కాకపోవడంతో దుండగులు అతణ్ని మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లా అడవులకు తీసుకెళ్లారు. అక్కడి వెవేజీ గ్రామ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం.. దేబే కాళ్లూ చేతులు కట్టేసి, ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయారు. అయితే, దుబే మంటల్లో కాలుతుండగానే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు గంటల తర్వాత కొందరు స్థానికులు అటుగా వెళ్లగా కొనప్రాణంతో దుబే కనిపించాడు..

చనిపోయే ముందు అంతా చెప్పేసి..

చనిపోయే ముందు అంతా చెప్పేసి..

అడవుల్లో కాలిపోయిన దుబేను చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అతణని దగ్గర్లోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే 90 శాతం కాలిన గాయాలైనట్లు గుర్తించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం దుబేను ముంబయిలోని నావికాదళ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే కన్నుమూశారు. చనిపోయే ముందు దూబే జరిగిందంతా పోలీసులకు వివరించారు. ఉళ్లోగానీ, పని ప్రదేశంలోగానీ అతనికి శత్రువులెవరూ లేరని కుటుంబీకులు చెబుతున్నారు. అనుకున్న విధంగా డబ్బులు రానందుకే కిడ్నాపర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe