Saturday, May 14, 2022

చైనాకు అమెరికా బంపర్‌ ఆఫర్‌- ఘర్షణ వద్దు-నిజాయితీగా పోటీపడదాం- బైడెన్ సూచన


అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, చైనా తమ ఆధిపత్య పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు అవసరమైన సామాగ్రిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాయి. తద్వారా వాటిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ఆశించాయి. ఇది ఓ దశలో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధంగా పరిణమించింది. ఒకరి ఉత్పత్తులు మరొకరు బహిష్కరించుకునే వరకూ ఇది సాగింది. అయితే తాజాగా మారిన పరిస్ధితుల్లో ఆగ్ర రాజ్యాల మధ్య తీవ్ర పోటీ తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.

 ఘర్షణకు చెక్‌- తీవ్ర పోటీ ఉంటుందన్న బైడెన్‌

ఘర్షణకు చెక్‌- తీవ్ర పోటీ ఉంటుందన్న బైడెన్‌

చైనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగిస్తున్న వాణిజ్య యుద్ధం, ఘర్షణ స్ధానంలో ఇకపై తీవ్ర పోటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తద్వారా ట్రంప్ హయాంలో సాగించిన యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్లు బైడెన్‌ చెప్పకనే చెప్పారు. ప్రపంచ అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా-చైనా మధ్య తీవ్ర పోటీ ఉుంటుందని బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఘర్షణ స్ధానంలో పోటీ ఉంటుందని చెప్పడం వెనుక కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

 జిన్‌పింగ్‌ కఠినాత్ముడు, అప్రజాస్వామికుడు

జిన్‌పింగ్‌ కఠినాత్ముడు, అప్రజాస్వామికుడు

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో చైనా అధినేత జిన్‌పింగ్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

తాను అధికారంలోకి వచ్చాక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇప్పటివరకూ మాట్లాడలేదని, అయితే ఆయన చాలా కఠినంగా ఉంటారని బైడెన్‌ తెలిపారు. ఇది విమర్శ కాదని, వాస్తవం మాత్రమేనని బైడెన్ పేర్కొన్నారు. జిన్ పింగ్‌ ప్రజాస్వామిక వాది కాదని, ఆయన శరీరంలో ఎక్కడో ఓ చిన్న ప్రజాస్వామిక ఎముక మాత్రమే ఉందన్నారు.

 జిన్‌పింగ్‌కు బైడెన్ సలహా ఇదే

జిన్‌పింగ్‌కు బైడెన్ సలహా ఇదే

చైనా అధినేత జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ సలహా కూడా ఇచ్చారు. జిన్‌పింగ్‌ను నేను చెప్పాలనుకుంటోఁది ఒక్కటే. మన ఇరుదేశాల మధ్య ఘర్షణ అవసరం అయితే అది తీవ్ర పోటీగా మాత్రమే అని బైడెన్‌ తెలిపారు. నేను ట్రంప్‌లా చేయాలనుకోవడం లేదని, అంతర్జాతీయ నిబంధనలను ఇరువురూ గౌరవించుకుందామని జిన్‌పింగ్‌కు బైడెన్ సూచించారు. తద్వారా బైడెన్… జిన్‌పింగ్‌కు తాను ట్రంప్‌లా వ్యవహరించనని, మనం కేవలం అంతర్జాతీయ పద్ధథుల ప్రకారం వాణిజ్యంలో పోటీపడతామని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.

దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.



Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe