Tuesday, September 21, 2021

చైనాలో ప్రమాదకర రీసెర్చ్ కోసం అమెరికా నిధులిచ్చిందా

International

-BBC Telugu

By BBC News తెలుగు

|

డాక్టర్ ఫౌచీ

కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతుండగానే అమెరికా నిధులను ఉపయోగించి చైనాలో వైరస్‌పై అధ్యయనం చేశారంటూ కొత్త వివాదమొకటి మొదలైంది.

వుహాన్‌లోని ఒక ల్యాబ్ నుంచి వైరస్ లీకయి ఉండొచ్చన్న నిరూపణ కాని ఒక సిద్ధాంతానికి ఈ అధ్యయనానికి సంబంధం ఉంది.

ప్రపంచంలోని మొట్టమొదటి కరోనా కేసు ఈ వుహాన్ నగరంలోనే నమోదైంది.

అమెరికా నిధులను ఉపయోగించి చేసిన ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ అధ్యయనాలు కొన్ని వైరస్‌లను(కరోనా వైరస్ కాదు) తయారుచేశాయని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ రేండ్ పాల్ ఆరోపించారు.

అయితే, ఆ ఆరోపణలను అమెరికా సాంక్రమిక వ్యాధుల చీఫ్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తీవ్రంగా ఖండించారు.

దోమ

‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ రీసెర్చ్ అంటే ఏమిటి?

ఒక జీవి కొత్త సామర్థ్యాలను సంతరించుకోవడాన్ని ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ అంటారు. ఇది ప్రకృతి సహజంగా జరగొచ్చు, లేదంటే ప్రయోగశాలలో ఈ సామర్థ్యాలను సాధించొచ్చు.

జీవుల జెనెటిక్ కోడ్ మార్చడం ద్వారా కానీ, భిన్నమైన వాతావరణం, పరిసరాలలో జీవులను ఉంచడం ద్వారా కానీ సైంటిస్టులు ఈ మార్పులు కలిగేలా చేస్తారు.

కరోనావైరస్ సోకిన మానవ కణం

కరవుకాటకాలను తట్టుకునే వంగడాలను సృష్టించడం, దోమలను వ్యాధులను వ్యాపింపజేసే గుణాన్ని తగ్గించేలా చేయడం వంటివి దీనికి ఉదాహరణలు.

ఇలాంటి అధ్యయనాలతో ముప్పు ఎక్కువే అయినప్పటికీ వైరస్‌లు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రబలే మహమ్మారులను ఎదుర్కోవడానికి, వ్యాక్సీన్‌లు కనిపెట్టడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వుహన్ ల్యాబ్

చైనాలో వైరస్ రీసెర్చ్ కోసం అమెరికా ఖర్చు చేసిందా?

అవును, అమెరికా ఈ రీసెర్చ్‌కు కొంత కంట్రిబ్యూట్ చేసిందని డాక్టర్ ఫౌచీ అన్నారు.

డాక్టర్ ఫౌచీ అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ ఇనిస్టిట్యూ ఆఫ్ హెల్త్'(ఎన్ఐహెచ్) అనుబంధ ‘అలర్జీలు, సాంక్రమిక వ్యాధుల జాతీయ సంస్థ, అమెరికా'(ఎన్ఐఏఐడీ)కు డైరెక్టర్ మాత్రమే కాదు ఆ దేశాధ్యక్షుడు బైడెన్ సలహాదారు కూడా.

వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసిపనిచేసే సంస్థ ‘ఎకో హెల్త్ అలయన్స్’కు ఎన్ఐహెచ్ నిధులిచ్చింది.

గబ్బిలాల నుంచి కరోనావైరస్ వస్తుందా అనేది కనుగొనేందుకు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎకో హెల్త్ అలయన్స్‌కు 2014లో నిధులు మంజూరు చేసింది ఎన్ఐహెచ్.

ఎకో హెల్త్‌కు ఎన్ఐహెచ్ నుంచి 37 లక్షల డాలర్ల నిధులు అందాయి.

2019లో ఈ ప్రాజెక్టును పొడిగించారు. అయితే, కరోనావైరస్ ప్రబలిన తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో దీన్ని నిలిపివేసింది.

సెనేటర్ రేండ్ పాల్

‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ కోసం అమెరికా నిధులనే వెచ్చించారా?

అయితే, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ ప్రయోగాల కోసం ఎన్ఐహెచ్ నిధులివ్వలేదని డాక్టర్ ఫౌచీ మే నెలలో చెప్పారు.

‘కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పడం నేరం. మీరు మీ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నారా?’ అని కొద్దిరోజుల కిందట సెనేటర్ రేండ్ పాల్ డాక్టర్ ఫౌచీని అడిగారు.

ఆ రీసెర్చ్ ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ కిందకే వస్తుందని రేండ్ పాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ 2015, 2017లో ప్రచురించిన రెండు పత్రాలను కూడా ఆయన ప్రస్తావించారు.

రేండ్ పాల్ అభిప్రాయానికి ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ రిచర్డ్ ఎబ్రైట్ నుంచి మద్దతు లభించింది.

‘పాల్ ప్రస్తావించిన రెండు రీసెర్చ్ పేపర్లలో కొత్త వైరస్‌లు(అంతకుముందు సహజసిద్ధంగా ఉనికిలో లేనివి) తయారైనట్లు ఉంది. మరింత సాంక్రమిక శక్తి గల వ్యాధికారక క్రిములను సృష్టించడంలో రిస్క్ చేసినట్లు ఆ పత్రాలలో ఉంద”ని ప్రొఫెసర్ రిచర్డ్ ఎబ్రైట్ ‘బీబీసీ’తో చెప్పారు.

ఆ పత్రాలలో పేర్కొన్న అధ్యయనం అంతా ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ కిందకే వస్తుందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary

Did US fund China for the dangerous research




Source link

MORE Articles

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Microsoft Surface Duo 2 mini-tablet updated features revealed in FCC filing

Something to look forward to: As Microsoft prepares to talk about...

Astronomers finally solve the mystery of a famous 900-year-old Chinese supernova

A 900-year-old mystery has finally been solved as an international team of astronomers say they have identified the source of a famous supernova...

The Best Gaming Monitors for 2021

Whether you're a serious PC gamer or a casual after-hours warrior, your hardware can be the pivot point between victory and...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe