Saturday, May 8, 2021

చైనా నంబర్ 45… 8 నెలలకు బయటపెట్టిన లెఫ్టినెంట్ జనరల్… సరిహద్దులో ఇప్పటి పరిస్థితి ఇదీ…

45 మంది చైనా జవాన్లు మృతి

గాల్వన్ లోయలో చోటు చేసుకున్న ఆ హింసాత్మక ఘటనలో 45 మంది చైనా జవాన్లు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ దాడి ద్వారా చైనా తమ జవాన్లను పోగొట్టుకున్నదే తప్ప సాధించిందేమీ లేదన్నారు. ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లోని ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. ఫిబ్రవరి 10న ఈ ప్రక్రియ మొదలైందని… మొత్తం నాలుగు దశల్లో ఇది పూర్తవుతుందని చెప్పారు.

మొత్తం నాలుగు దశల్లో...

మొత్తం నాలుగు దశల్లో…

మొదటి దశలో సాయుధ బలగాలు,మెకానికల్ రెజిమెంట్‌‌ను అక్కడినుంచి ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత రెండో దశ,మూడో దశల్లో ప్యాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణ,ఉత్తర భాగాన ఉన్న సైన్యాన్ని వెనక్కి రప్పించడం జరుగుతుందన్నారు. చివరి నాలుగో దశలో రెజాంగ్ లా,రెచిన్ లా,కైలాష పర్వత ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణ ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని శాటిలైట్స్,యూఏవీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని… కొన్నిచోట్ల కెమెరాలను సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు.

ఆ నిర్మాణాల తొలగింపు...

ఆ నిర్మాణాల తొలగింపు…

గతేడాది ఏప్రిల్‌కు ముందు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ చైనా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ పూర్తిగా తొలగించబడుతున్నాయని జోషీ తెలిపారు. టెంట్లు,బంకర్లు,డగౌట్స్ ఇలా అన్నీ తొలగించేస్తున్నట్లు చెప్పారు. ప్యాంగాంగ్ త్సో ఉత్తర భాగాన భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వాదనలో నిజం లేదన్నారు. ఫింగర్ 8 భారత్ ఆధీనంలోనే ఉంటుందని… అక్కడి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోందని చెప్పారు. ఈ పరిధిలో ఇకపై చైనాకు సంబంధించి ఎలాంటి మిలటరీ కార్యకలాపాలు ఉండబోవన్నారు.

వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చిన భారత్..

వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చిన భారత్..

ఎట్టకేలకు సరిహద్దు ప్రతిష్ఠంభన ఒక కొలిక్కి రావడం భారత్‌కు కచ్చితంగా విన్-విన్ సిచ్యుయేషన్ అన్నారు. నిజానికి మొదట్లో చర్చల ద్వారా చైనా దారికి రాకపోవడంతో ఆర్మీ చీఫ్ నుంచి తనకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ మేరకు చైనా పట్ల తాము కూడా దూకుడుగా వ్యవహరించామని… రెజాంగ్ లా,రెచిన్ లా,ప్యాంగాంగ్ దక్షిణ,ఉత్తర తీరాల్లోని వ్యూహాత్మక శిఖరాలపై పాగా వేయగలిగామని అన్నారు. దీంతో చైనా ఒత్తిడికి లోనైందని… ఎట్టకేలకు భారత్ అనుకున్నట్లుగా సైన్యం ఉపసంహరణ కొనసాగుతోందని తెలిపారు.


Source link

MORE Articles

ఎన్ఎస్ యూఐ మెరుపు ధర్నా.!మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాల వద్ద రచ్చరచ్చ.!

చెరువు భూములు కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం.. మల్లారెడ్డి ఆసుపత్రిని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ నాయకులు డిమాండ్...

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

Illegal affair: పబ్లిక్ లో ఫ్లాస్మా టీవీలో రాసలీలల వీడియో, గుండు కొట్టి ఊరేగింపు, అవమానంతో!

ఆమెకు 23 ఏళ్లు త్రిపురలోని సబ్రూమ్ జిల్లాలోని బేటగా గ్రామంలో 23 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. చూడటానికి ఎర్రగా, సన్నగా, నాజుకుగా ఉన్న ఆమె మీద...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe