Wednesday, May 18, 2022

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల కాల్పులు-8 మంది జవాన్ల మృతి- మృతులు పెరిగే అవకాశం

National

oi-Syed Ahmed

|

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఏరివేత కోసం సాగుతున్న కూంబింగ్‌లో ఇవాళ భారీగా జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బీజపూర్ జిల్లా సిలెగార్‌ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది జవాన్లు మృత్యువాత పడినట్లు సమాచారం. ఇంకా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్‌ జిల్లాలో ఉన్న సిలెగార్‌ అడవుల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారంతో జవాన్లు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. తారెం ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లు ఎదురుపడటంతో పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇరువర్గాలకూ భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 8 మంది జవాన్లు ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉంది.

at least eight jawans killed in gunfight with naxals in chhattisgarhs bijapur, still going on

బీజపూర్‌ జిల్లాలోని అడవుల్లో ప్రస్తుతం దాదాపు 400 మంది జవాన్లు కూంబింగ్‌లో పాల్గొంటున్నారు. నక్సల్స్‌ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఎస్టీఎఫ్‌, డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా దళాలు గాలింపులో నిమగ్నమయ్యాయి. ఇందులో ఇవాళ జరిగిన కాల్పుల్లో ఆరుగురు డీఆర్‌జీ జవాన్లు, ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ నక్సల్స్‌ ఎంతమంది చనిపోయారో లెక్క తెలిసే అవకాశం లేదు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe