జగన్ కు శారదా పీఠాధిపతి అద్భుతమైన సలహా
ప్రతిపక్ష పార్టీల విమర్శలను జగన్ తిప్పికొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఆలయాలపై జరుగుతున్న దాడులు విగ్రహ విధ్వంసం ఘటనలపై పారదర్శకంగా విచారణ జరిపినా ప్రతిపక్షాల దాడి మాత్రం తగ్గటం లేదు. జగన్ ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్ కు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే, అదే సమయంలో హిందువుల పట్ల జగన్ కు ఉన్న పారదర్శక వైఖరిని స్పష్టం చేసే సూచన ఒకటి జగన్ కు చేసినట్లుగా సమాచారం.

ఆలయాలపై దాడులు .. జగన్ పై తీవ్ర విమర్శలు .. చెక్ పెట్టే సలహా ఇచ్చిన స్వామీజీ
శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్, పరిపాలనా రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయడానికి మంచి ముహూర్తం తో పాటుగా, అనేక అంశాలపై స్వరూపానంద స్వామితో చర్చించారు. ఆ సమయంలో జగన్ కు ఆయన మంచి సలహా ఇచ్చారు.
రాష్ట్రంలో ఆలయాల పై జరిగిన దాడులు, విగ్రహ విధ్వంసం ఘటనలపై జగన్ తో చర్చించిన స్వామీజీ హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.

పీఠాధిపతుల సమావేశం , హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటుకు సూచన
అంతేకాదు దేవాదాయ శాఖ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పీఠాధిపతుల సమావేశాన్ని నిర్వహించాలని కూడా సీఎం జగన్ కు స్వామీజీ సూచించారు. స్వామీజీ సూచనలపై జగన్ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని స్వామీజీతో చెప్పినట్లుగా, సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. సీఎం జగన్ హిందూ ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేసి, పీఠాధిపతులందరితో సమావేశాన్ని నిర్వహిస్తే జగన్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

సానుకూలంగా స్పందించిన జగన్ .. అదే చేస్తే ప్రతిపక్షాలకు చెక్ పెట్టినట్టే!
అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ తనకున్న నిబద్ధతను, అందరికీ తెలిసేలా చేసినట్లవుతుందని భావిస్తున్నారు.
శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాత్మానందేంద్ర స్వామీజీల తో కలిసి శారదా పీఠం లో జరిగిన వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీతో అనేక కీలక అంశాలపై చర్చించిన సీఎం జగన్, ముఖ్యంగా హిందూ ధర్మ పరిషత్ ఏర్పాటుకు ఓకే చెప్పి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు.