Andhra Pradesh
oi-Madhu Kota
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గడిచిన 20 నెలల జగన్ పాలనలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకునే పరిస్థితి లేకపోయిందని టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు. మహిళా హోం మంత్రి ఉండి కూడా ఫలితం లేదని వాపోయారు. సోమవారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఏపీలో మళ్లీ కలకలం: మాఫియాతో పొలిటికల్ లింకులు? -ప్రజలతో చెలగాటం -ఆగేదెప్పుడు?
ఏపీ హోంమంత్రి సుచరిత కేవలం కీలుబొమ్మగా వ్యవహరిస్తుననారని, సీఎం జగన్ లేదా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా ఆడటం తప్ప మహిళల కోసమంటూ మంత్రి చేసిందేమీ లేదని టీడీపీ నేత అనిత ఆరోపించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

”నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా భయపడుతున్నట్లున్నారు. రెడ్డి అని పేరుకు తోక ఉంటే ష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా? ఇదంతా ఒక ఎత్తయితే, జగన్ మీడియా మాత్రం అనూష కేసు నిందితుడి పేరుకు రెడ్డి తీసేసి వార్తలు రాస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు..
viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్
జగన్ సర్కారు తీసుకొచ్చిన దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టం. కనీసం దిశా చట్టాన్ని సరిగా రూపొందించే దమ్ము కూడా ఈ ప్రభుత్వానికి లేదు. జగన్ పాలనలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయి. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారు. కానీ నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదు? నిజంగా ఈకేసులో నిందితుడుకి 21 రోజుల్లోపే శిక్ష పడితే సీఎం జగన్కు సలాం చేస్తా. ఇంత దారుణం జరిగినా స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించకపోవడం దారుణం” అని వంగలపూడి అనిత అన్నారు.