Tuesday, August 3, 2021

జపాన్ ప్రేమికులు: ఇంటి పేరు మార్చుకోవాలని పెళ్లి వద్దంటున్నారు

International

-BBC Telugu

By BBC News తెలుగు

|

మూడేళ్ల కిందట 34 ఏళ్ల మేరీ ఇనుకి ఆమె బాయ్ ఫ్రెండ్ కొటారి ఉసుయితో పెళ్లి నిశ్చయమయింది. అయితే వారు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని అంటున్నారు. దీనికి కారణం పెద్దలు అభ్యంతర పెట్టడమో, కోవిడ్ సంక్షోభమో కాదు. గొడవంతా పెళ్లి చేసుకున్న తర్వాత మారే ఇంటి పేర్లతో ముడిపడి ఉంది.

జపాన్‌లో పాత చట్టం ఒకటి భార్యభర్తల ఇంటి పేర్లు ఒకేలా ఉండాలని శాసిస్తుంది. ఆ ఇంటి పేరు అమ్మాయిదైనా కావచ్చు లేదా అబ్బాయిదైనా కావచ్చు. మొత్తానికైతే పెళ్లి తరువాత ఇద్దరికీ ఒకే ఇంటిపేరు ఉండాలి.

కానీ, సాధారణంగా 96 శాతం అమ్మాయిలే వివాహం తర్వాత తమ ఇంటి పేర్లను మార్చుకుంటారు అక్కడ.

“ఇది చాలా అన్యాయం. మా ఇంటి పేర్లను మేం ఉంచుకోవడానికి మాకు స్వతంత్రం ఉండాలి” అని ఇను అంటారు.

ఈ అభిప్రాయంతో కొటారి కూడా ఏకీభవిస్తున్నారు. “నేను ముందు ఇంటి పేరు మార్చుకుందామనుకున్నాను. కానీ మా బంధువులలో కొందరికి అది నచ్చలేదు. నాకు ఎవరినీ బాధపెట్టాలని లేదు. మేం ఇంటి పేరును మార్చుకోవాలా, ఉంచుకోవాలా అనే విషయంలో మాకు స్వేచ్ఛ ఉండాలి” అని అన్నారు వారిద్దరూ.

వివాహం తరువాత వేర్వేరు ఇంటి పేర్లు ఉండడంపై చట్టపరంగా అభ్యంతరం ఉన్న దేశాలలో జపాన్ కూడా ఒకటి.

ఇలాంటి చట్టం మహిళలపై వివక్ష చూపుతుందని ఐరాస కమిటీ ఒకటి అభిప్రాయపడింది.

ఈ నియమాలను మార్చాలని ఆరేళ్ల కిందట వేసిన రెండు కేసులు కోర్టులో వీగిపోయాయి. కానీ, ఇను, ఉసుయి లాంటి వారి చేరికతో సంస్కరణల కోసం చేస్తున్న ఉద్యమం మాత్రం మరింత ఊపందుకుంది.

అనాదిగా సాగుతున్న పోరాటం

ఇంటిపేర్ల విషయంలో ఎప్పటి నుంచో పోరాటం జరుగుతోంది.

1605లో ఒక మహిళ వివాహం తర్వాత తన పుట్టింటి ఇంటి పేరును ఉంచుకోవాలనే కోరికను నెరవేరని ఆశగా పరిగణించారని డాక్టర్ సోఫీ కులాంబో రాశారు.

ఈ పితృస్వామ్య విధానాన్ని సవాలు చేసిన వారికి ఆగ్రహంతో కూడిన ప్రతిఘటన ఎదురైంది.

కొంత మంది 1800 ప్రాంతంలో కోర్టు కేసుల ద్వారా తమ ఇంటి పేర్లను ఉంచుకునే అవకాశాన్ని పొందారు.

ఇలాంటి పోరాటమే అమెరికాలో సఫ్రాగేట్స్ కూడా ఎదుర్కొన్నారు. మహిళలు తమకు నచ్చిన ఇంటి పేరును వాడుకోవచ్చని తీర్పులు వెలువడడానికి 1972 వరకు వేచి చూడాల్సి వచ్చింది.

40 ఏళ్ల తర్వాత కూడా జపాన్ ఆ మలుపు తిప్పే క్షణం కోసం ఇంకా ఎదురు చూస్తోంది.

ఇంటిపేర్ల మార్పులకు సంబంధించిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని అది మానవ హక్కులను ఉల్లఘిస్తుందని అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావురి ఓగునై మరో నలుగురితో కలిసి కేసు వేశారు.

కానీ, 19వ శతాబ్దపు నియమాన్ని సమర్థిస్తూ ఒక కుటుంబం ఒకే ఇంటి పేరును వాడటం సమంజసమని జపాన్ సుప్రీం కోర్టు 2015లో తీర్పు ఇచ్చింది.

“ఒక పొగరుగా ఉన్న టీచర్ మమ్మల్ని కసురుతున్నట్లుగా అనిపించింది” అని ఓగునై చెప్పారు. ఆమె అనధికారికంగా ఆమె పుట్టింటి ఇంటి పేరునే వాడుకుంటున్నారు. “కోర్టు కూడా వ్యక్తి కున్న హక్కులను గౌరవిస్తుందని ఆశించాను” అని అన్నారు.

అయితే, దీని పై కొత్త చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత పార్లమెంటుదని జడ్జి అన్నారని ఆమె చెప్పారు.

చాలా పని స్థలాలలో లాగే జపాన్‌లో రాజకీయ చిత్రం కూడా పురుషులతో నిండిపోయి ఉంది. మహిళలే ఇంటి పని, పిల్లల సంరక్షణ చూసుకోవాలని సామాజిక నియమాలు పాతుకుపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా లైంగిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

జపాన్ లైంగిక సమానత విషయంలో 153 దేశాలలో 121వ స్థానంలో ఉన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ఒకటి వెల్లడించింది.

ప్రభుత్వం మాత్రం మహిళలను ఉద్యోగాలలో చేరాలని పిలుపునిస్తోంది. కానీ, జెండర్ గ్యాప్ మాత్రం పెరిగిపోతోంది.

గతంలో జరిపిన అధ్యయనంతో పోలిస్తే జపాన్ 11 స్థానాలు కిందకు పడిపోయింది.

సామాజిక మరణం

అయితే, ఇంటి పేర్ల మార్పు విషయంలో చట్ట సభల నాయకుల మనసు మార్చేందుకు చింజియో యాక్షన్ అనే గ్రూపు ద్వారా టోక్యో కు చెందిన ఒక పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగి నహో ఇడా 2018 నుంచి ఉద్యమం చేస్తున్నారు.

ఇలా ఇంటి పేరును మార్చుకోవడం మహిళ మరొకరి అధీనంలో ఉండటానికి ఒక నిదర్శనమని ఆమె భావిస్తారు.

నిజానికి ఇడా ఆమె మాజీ భర్త ఇంటి పేరు. 1990లో ఆమెకు వివాహమైనప్పుడు ఆమె భర్త ఆమె ఇంటి పేరును పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందని చెప్పినట్లు చెప్పారు.

“నాకు వచ్చిన కొత్త ఇంటి పేరుతో నన్నెవరో ఆక్రమించినట్లు అనిపించింది” అని ఆమె అన్నారు.

అధికారికంగా ఆమె ఇడా అనే ఇంటి పేరును వాడడం ఆమె మానేశారు. కానీ, ఆమె మరో సారి వివాహం చేసుకోవడంతో ఇష్టం లేని మరో మూడో ఇంటి పేరు ఆమె పేరులో చేరింది.

జపాన్ కొత్త ప్రధాని యోషిహిడే సుగ ఈ ఇంటి పేరు సంస్కరణలను సమర్ధించడంతో ఆయన గెలుపు నహో లాంటి వారిలో కాస్త ఆశను రేపింది.

కానీ, ప్రభుత్వం గత డిసెంబరులో ఇంటి పేర్ల సంస్కరణల గురించి ప్రస్తావన లేకుండా మహిళా సాధికారత లక్ష్యాలను ప్రవేశ పెట్టింది.

“ఇలాంటి మార్పులు కుటుంబం ఆధారంగా నడిచే సామాజిక వ్యవస్థను నాశనం చేస్తుంది” అని మాజీ మంత్రి సానే తకైచి అన్నారు.

మహిళలు పుట్టింటి ఇంటి పేరును ఉంచుకోవడానికి తీసుకుని వచ్చే చట్టపరమైన మార్పులకు తాను వ్యతిరేకమని కొత్తగా నియమితురాలైన మహిళా సాధికారత, లైంగిక సమానత్వ శాఖ మంత్రి టమాయో మరుకావా గత వారమే తన అభిప్రాయాన్ని ప్రకటించారు.

“భర్త ఇంటి పేరును పెట్టుకోవడాన్నినిరసించే మహిళలు కుటుంబం అనే ఆలోచననే నాశనం చేస్తారు” అని అమెరికాలోని మిడిల్ బరి కాలేజీలో ప్రొఫెసర్ లిండా వైట్ అన్నారు.

“జపాన్‌లో గృహాలను ఒకే ఇంటిపేరుతో ఉన్న కుటుంబ సభ్యులతో నమోదు చేసే రిజిస్ట్రీ వలన ప్రభుత్వం నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారాల వరకు అన్ని చోట్లా పితృస్వామ్య అధికారాన్ని పరిరక్షించుకోవడానికి సహాయపడింది” అని చెప్పారు.

జపాన్‌లో కూడా సమాజం మారాలని చూస్తోంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ పుట్టింటి ఇంటి పేర్లనే ఉంచుకోవడానికి ఆసక్తి చూపినట్లు కొన్ని పోల్స్ చెబుతున్నాయి.

71 శాతం మంది ఇంటి పేరును నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉండాలని చెప్పినట్లు చింజియో యాక్షన్, వసెడా యూనివర్సిటీ నిర్వహించిన సర్వే తెలిపింది.

ఈ మారుతున్న కొత్త పరిస్థితుల్లో ప్రస్తుతం వీటిపై కనీసం 9 కేసులు కోర్టులో ఉన్నాయి. వీటిని నమోదు చేసిన వారిలో పురుషులు కూడా ఉన్నారు.

ఇక్కడ మహిళల హక్కులు, ఫెమినిజం అనే కంటే, మానవ హక్కుల కోసం పోరాటం చేయాలనే తపన ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

“ఇది ఫెమినిస్ట్ లకు సంబంధించిన అంశం అనే కంటే వ్యక్తి గుర్తింపుకు సంబంధించిన విషయం” అని 67 సంవత్సరాల ఫుజికో సకాకిబారా అనే న్యాయవాది చెప్పారు. ఇది మహిళల పై ఎంత ప్రభావం చూపిస్తుందో అంతే ప్రభావం పురుషుల పై కూడా చూపిస్తుంది. అని ఆమె అన్నారు.

ఈ కేసు వేసిన మొత్తం 18 మందిలో సగం మంది పురుషులు ఉన్నారు. అందులో టోక్యో సాఫ్ట్ వేర్ సంస్థలో సీఈఓ గా పని చేస్తున్న ఒక వ్యక్తి తన భార్య ఇంటి పేరును జత చేసుకున్నారు.

ఇంకొక రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి కూడా 28 సంవత్సరాలుగా ఒక మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నప్పటికీ ఇంటి పేర్లను మాత్రం మార్చుకోలేదు.

యువతతో పాటు వృద్ధులు కూడా ఈ మార్పునకు మద్దతు తెలపడంతో జపాన్‌లో ఈ ఏడాది ఈ అంశం పై కొత్త చట్టం వస్తుందేమోనని భావిస్తున్నారు.

ఈ ఉద్యమంలో పురుషులు కూడా ఉండటం ఒక మేలైన పరిణామం అని నహో అంటారు.

జంట

పేరులో ఏముంది?

ఇంటి పేరును మార్చుకోవడం వలన ఉద్యోగం చేసే మహిళలు కొన్ని డజన్ల డాక్యుమెంట్లలో కూడా తమ పేర్లను మార్చుకోవలసి వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ.

ఈ ఇంటి పేర్ల చట్టం వలన ఇంటి పేర్లను మార్చుకోకపోతే ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేటప్పుడు ఎవరి గురించి అయినా నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. ఈ కారణం వలన కూడా చాలా మంది వివాహం చేసుకోకుండా ఉండిపోయారు.

చాలా మంది మహిళలకు ఇది వారి గుర్తింపుతో సంబంధం ఉన్న అంశం

కేవలం పుట్టింటి ఇంటి పేరును ఉంచుకోవడం కోసమే ఇజుమీ ఓంజీ అనే అనెస్థిస్ట్ తన భర్తకు అసాధారణ రీతిలో విడాకులు ఇచ్చారు.

ఈ విడాకులు కేవలం కాగితానికే పరిమితం. ఆమె విడాకుల తర్వాత కూడా భర్తతోనే కలిసి ఉంటున్నారు.

“అది నేను, అది నా గుర్తింపు” అని 65 సంవత్సరాల ఓంజీ అంటారు.

ఈమె కూడా కోర్టులో దీని కోసం పోరాడుతున్నారు.

జపాన్ లో కూడా అమెరికా, యూకెలలో వలె పెళ్లి తర్వాత మహిళలు తమ ఇంటి పేర్లను మార్చుకుంటారు.

“భర్త ఇంటి పేరును పెట్టుకోవడం వలన కుటుంబంతో దగ్గరైన భావన కలుగుతుందని తీసుకునే సహజమైన నిర్ణయం” అని 20 సంవత్సరాల మహిళ చెప్పారు.

బ్రిటిష్ మహిళల్లో 90 శాతం మంది వివాహం తర్వాత తమ పేరును మార్చుకున్నారని 2016లో నిర్వహించిన ఒక సర్వే తెలిపింది.

లైంగిక స్పృహ, ఫెమినిజం పట్ల మక్కువ చూపుతున్న మహిళల సంఖ్య పెరుగుతున్న నేటి కాలంలో ఈ ఇంటి పేరు మార్చుకునే సంస్కృతి ఇంకా ఉండటం చాలా మంది పరిశోధనకారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

“ఎవరి ఇంటి పేరును వారు ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి” అని సాటో అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




Source link

MORE Articles

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

మోడీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్: అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా...

Benefit of banana health: रोज 1 केला सेहत के लिए कर सकता है कमाल, बस जान लीजिए सेवन का सही टाइम

benefit of banana health: आज हम आपके लिए केला के फायदे लेकर आए हैं. केला सबसे ज्यादा एनर्जी देने वाला फल है. खास...

Wife: అదే విషయంలో గొడవలు, ఏంచేస్తావు అని ఎదురు తిరిగిన భార్య, స్పాట్ లో చంపేసిన భర్త !

బెంగళూరులో కాపురం ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లో సయ్యద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సయ్యద్, బేబి అయోషా అే...

చంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యం

మా ప్రభుత్వం రాగానే అంతకంత చూపిస్తాం అంటాడు బాబు తాజాగా చట్టం చేతికి చిక్కిన తన దొంగల ముఠా సభ్యులను వెనకేసుకు వస్తూ ప్రభుత్వంపై బాబు ఏమని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe