Sunday, May 15, 2022

జయలలిత మళ్లీ పుట్టింది -తీవ్రవాదుల నుంచి కాపాడింది: బీజేపీ నేత విజయశాంతి భావోద్వేగం

అమ్మ మళ్లీ పుట్టారు..

జయలలిత జయంతి సందర్భంగా ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ నేత విజయశాంతి బుధవారం ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘‘అమ్మా… మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా… తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి.. అంతేకాదు..

తీవ్రవాదులు టార్గెట్ చేసినప్పుడు..

తీవ్రవాదులు టార్గెట్ చేసినప్పుడు..

మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు.. కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ మర్చిపోలేనిది. నన్ను ఉద్దేశించి.. ‘పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు)’ అని, ‘ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి)’ అని మీరు ఇచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి..” అని విజయశాంతి పేర్కొన్నారు. మరోవైపు..

 అమ్మ అభిమానులంతా ఏకం కావాలి..

అమ్మ అభిమానులంతా ఏకం కావాలి..

జయలలిత జయంతి సందర్భంగా చెన్నైలో బుధవారం ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. జయలలితకు నివాళులు అర్పించేక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శశికళ నివాసానికి వచ్చేశారు. అన్నాడీఎంకేలో జయలలిత తర్వాతి స్థానం తనదే అనే సంకేతాలకు శశికళ కేడర్‌కు పంపారు. టి.నగర్‌లోని తన నివాసం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి.. ‘‘తలైవి అమ్మకు నిజమైన కేడర్ అంతా ఏకం కావాలి. మీరంతా అన్నాడీఎంకే కోసం సమష్టిగా పనిచేయాలి” అని శశికళ పిలుపునిచ్చారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe