[ad_1]
Chemical Sector Stocks: రసాయన రంగం గత 5 సంవత్సరాలకు పైగా మార్కెట్ ఫోకస్‌లో ఉంది. కరోనా కాలానికి ముందు, కరోనా కాలంలో, కరోనా పరిస్థితులు సద్దు మణిగిన తర్వాత ఈ రంగంలో విభిన్నమైన ట్రెండ్స్ కనిపించాయి. అయితే రెండు రకాల కంపెనీలు ఎక్కువగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. మొదటి రకం కంపెనీలు… ఏకీకరణలో వెనుకబాటు మీద దృష్టి పెట్టి, తమ సామర్థ్యాన్ని విస్తరించాయి. రెండో రకం కంపెనీలు… దిగుమతి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టి, తమ ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాయి. ఎందుకంటే.. అతిగా విదేశాల మీద, ముఖ్యంగా చైనా మీద ఆధారపడితే, కరోనా లాంటి పరిస్థితుల్లో తీవ్రంగా దెబ్బతింటామని అనుభవపూర్వకంగా ఇవి తెలుసుకున్నాయి. పైగా.. దిగుమతి చేసుకునే ఎలిమెంట్స్ మీద ఆధారపడడం తగ్గిస్తే, మార్జిన్‌లలో మెరుగుదలను, స్థిరత్వాన్ని సాధించవచ్చు.
NSEలో లిస్ట్ అయిన స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను మాత్రమే ఈ కథనం కోసం పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. Refinitiv స్టాక్ రిపోర్ట్ ప్లస్ డేటా ఆధారంగా ఈ కెమికల్స్ స్టాక్స్‌ను ఎక్స్‌పర్ట్‌లు స్క్రీనింగ్ చేశారు.
బీఏఎస్‌ఎఫ్ (BASF)
స్టాక్ స్కోర్: 10
ఎనలిస్ట్ రికమెండేషన్ : స్ట్రాంగ్ బయ్ (Strong Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 60.80%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 8%
మార్కెట్ విలువ: 11,864 కోట్ల రూపాయలు
నోసిల్ (Nocil)
స్టాక్ స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్ : బయ్ (Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 20.20%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 6.50%
మార్కెట్ విలువ: 3,851 కోట్ల రూపాయలు
News Reels
బేయర్ క్రాప్ సైన్స్ (Bayer Cropscience)
స్టాక్ స్కోర్: 7
ఎనలిస్ట్ రికమెండేషన్ : బయ్ (Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 17.50%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 12.50%
మార్కెట్ విలువ: 21,297 కోట్ల రూపాయలు
సుమిటోమో కెమికల్ ఇండియా (Sumitomo Chemical India)
స్టాక్ స్కోర్: 9
ఎనలిస్ట్ రికమెండేషన్ : బయ్ (Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 10.60%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 7.10%
మార్కెట్ విలువ: 24,605 కోట్ల రూపాయలు
స్ట్రాంగ్ బయ్, బయ్ రికమెండేషన్స్; కనీసం 10% ర్యాలీ చేయగల అవకాశం; న్యూట్రల్ – పాజిటివ్ ఔట్‌లుక్; రూ. 1000 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలను ప్రాతిపదికగా చేసుకుని ఈ 4 కెమికల్స్ స్టాక్స్‌ను సూచించడం జరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link