Saturday, July 24, 2021

జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..

చంద్రబాబుకు ఎన్టీఆర్ సెగ

రెండు రోజుల పర్యటన కోసం కుప్పం విచ్చేసిన చంద్రబాబు, శుక్రవారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వీలైన చోటల్లా పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కుప్పం జగన్ జాగీరు కాదని, కుప్పంలోనే మకాం వేసి.. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని ఆయన ప్రతినబూనారు. అయితే, అనూహ్య రీతిలో బాబుకు ఓ చేదు అనుభవం కూడా ఎదురైంది. టీడీపీ అధినేతకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో సెగ తగిలింది..

కరోనా విలయంలో చైనా అద్భుతం -ఆకలి కేకలు సమాప్తం -కడు పేదలు లేరంటూ జిన్‌పింగ్‌ ప్రకటన

కుప్పంలో తారక్ ఫ్యాన్స్ హల్‌చల్

కుప్పంలో తారక్ ఫ్యాన్స్ హల్‌చల్

టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా సార్లు జూనియన్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం, నందమూరి వారసులకు తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వ్యక్తం కావడం సహజంగా జరిగేదే. అయితే, ఎన్టీఆర్ పేరుతో ఏకంగా చంద్రబాబును అడ్డుకునే స్థాయిలో దృశ్యాలు మాత్రం తొలిసారి కుప్పంలో ఇవాళ చోటుచేసుకున్నాయి. చంద్రబాబు పర్యటన సందర్భంలో కుప్పంలో ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలతో భారీ ఎత్తున ఫ్లెక్లీసు వెలిశాయి. అంతేకాదు, వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ ముందు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. శుక్రవారం శాంతిపురంలో..

జూనియర్ రాకపై బాబు మౌనం..

జూనియర్ రాకపై బాబు మౌనం..

చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే తారక్ ఫ్యాన్స్ అడ్డుపడ్డారు. రెండేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతిన్న దరిమిలా జూనియర్ ఎన్టీఆర్ ను వెంటనే పార్టీలోకి ఆహ్వానించాలని, టీడీపీలో కీలక బాధ్యతలను తారక్ కు అప్పగించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసిన అభిమానులు… చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జూనియర్ రాకపై అభిమానులు గట్టిగా నినాదాలు చేయడంతో చంద్రబాబు మాట్లాడటం ఆపేసి, కాసేపు మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై..

జగన్ దెబ్బకు కుప్పంలో పడ్డాడు..

జగన్ దెబ్బకు కుప్పంలో పడ్డాడు..

చంద్రబాబు కుప్పం పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ కోసం కార్యకర్తల నినాదాలు, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తదితర అంశాలపై వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాబలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ చీఫ్ చంద్రబాబు మళ్లీ కుప్పం గల్లీలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇవ్వాలని ప్రస్తుత సీఎం జగన్ ను కోరడం ఎపిక్ దృశ్యమన్నారు. టీడీపీకి ఇంతటి దారుణమైన దుస్థితి పట్టడానికి కారణాలను కూడా అంబటి వెల్లడించారిలా..

లోకేశ్ వల్లే సైకిల్ తునాతునకలు

లోకేశ్ వల్లే సైకిల్ తునాతునకలు

‘‘40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ సీఎం అయిన చంద్రబాబుకు ఇవాళ సొంత గడ్డ కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప కుప్పంలో ప్రచారానికి టీడీపీకి దిక్కులేదన్నట్లుగా పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్ననాడే మేనిఫెస్టోను అమలు చేయలేకపోయిన బాబు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి హామీలు నెరవేరుస్తాడా? నిజానికి లోకేశ్ వచ్చిన తర్వాతే టీడీపీకి దుర్గతి పట్టింది. నారా లోకేశ్ వల్లే సైకిల్ తునాతునకలు అయింది. జగన్ అనే గన్నుకు తూటాలు ఉన్నాయి కాబట్టే లోకేశ్ మంగళగిరిలో తుస్సుమన్నాడు. పాపం లోకేశ్ మానసిక పరిస్థితి చూస్తే జాలేస్తోంది. భువనేశ్వరిగారైనా కొడుకుపై శ్రద్ధతీసుకోవాలి” అని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.


Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe