Hindustan Aeronautics Shares: ఇవాళ (బుధవారం, 08 మార్చి 2023) స్టాక్‌ మార్కెట్‌ నెగెటివ్‌గా ప్రారంభమైనా, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (HAL) షేర్‌ మాత్రం జెట్‌ ఫైటర్‌లా దూసుకుపోయింది. 

BSEలో, ఉదయం 11.20 గంటల సమయానికి HAL షేరు రూ.123 లేదా 4.44% లాభంతో రూ.2,831 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఆ సమయానికి ఇంట్రాడే గరిష్ట రూ.2,836. సోమవారం నాటి ముగింపు ధర రూ.2,710. 

70 ‘HTT-40 బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌’లను కొనుగోలు చేసేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒప్పందం కుదుర్చకుంది. ఒప్పందం విలువ 6,800 కోట్ల రూపాయలు. ఈ కాంట్రాక్ట్‌ కాల పరిమితి ఆరు సంవత్సరాలు. దీనివల్ల కంపెనీ భవిష్యత్‌ ఆదాయం, లాభం రెండూ పెరుగుతాయని మార్కెట్‌ అంచనా వేసింది. అందువల్లే బుధవారం నాటి ఇంట్రాడే ట్రేడ్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లకు డిమాండ్‌ పెరిగింది.

దేశ రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్‌’ సాధించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో అతి పెద్ద భాగంగా ఈ కాంట్రాక్టును చెప్పుకోవచ్చు. HAL నుంచి 6,800 కోట్ల రూపాయల విలువైన 70 ‘HTT-40 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌’ల సేకరణకు మార్చి 1, 2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మల్టీ బ్యాగర్‌ స్టాక్‌
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ ఒక మల్టీ బ్యాగర్‌ స్టాక్‌. గత 12 నెలలు లేదా ఏడాది కాలంలో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ స్క్రిప్‌ 113% వృద్ధి చెందింది. గత ఆరు నెలల కాలంలో ఈ స్క్రిప్‌ దాదాపు 17% ర్యాలీ చేయగా, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) 11% పైగా పెరిగింది. 

ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం… ఈ స్టాక్‌కు లభించిన అత్యధిక టార్గెట్ ప్రైస్‌ రూ.3300. అందరు ఎనలిస్ట్‌ల సగటు టార్గెట్ ధర రూ.2,852.

ఈ స్టాక్‌ను 9 మంది విశ్లేషకులు కవర్‌ చేస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది “స్ట్రాంగ్‌ బయ్‌” రేటింగ్‌ ఇవ్వగా… ఒక్కరు మాత్రం “సెల్‌” సిఫార్సు చేశారు.

మంచి లో-స్పీడ్‌ హ్యాడ్లింగ్‌ లక్షణాలు ఉన్న టర్బోప్రాప్ విమానం HTT-40. మెరుగైన శిక్షణ అనుభవాన్ని ఇది అందిస్తుంది. ఈ ఫుల్లీ ఏరోబాటిక్ ట్యాన్డమ్‌ సీట్ టర్బో ట్రైనర్‌లో ఎయిర్ కండిషన్డ్ కాక్‌పిట్, మోడెమ్ ఏవియానిక్స్, హాట్ రీఫ్యూయలింగ్, రన్నింగ్ చేంజ్-ఓవర్, జీరో-జీరో ఎజెక్షన్ సీట్లు ఉంటాయి.

ప్రస్తుతం, HTT-40 ఎయిర్‌క్రాఫ్ట్‌ సుమారుగా 56% స్వదేశీ పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. ప్రధాన విడిభాగాలు, ఉప వ్యవస్థలను దేశీయంగా తయారు చేయడం వల్ల ఈ రేషియో క్రమంగా 60%కి పెరుగుతుంది. 

ఈ భారీ కాంట్రాక్ట్‌ వల్ల కేవలం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మాత్రమే కాదు, దేశీయ MSMEలు సహా రక్షణ రంగంలో పని చేస్తున్న ప్రైవేట్ పరిశ్రమకు కూడా లబ్ధి చేకూరుతుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *