హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు ఇలా..

నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,350 లకు పెరిగింది. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర 100 రూపాయల మేర పెరిగింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,250 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 50 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57, 110 రూపాయల ధర పలుకుతుంది. ఇక ఈ ధర నిన్న 57,060 రూపాయల వద్ద ఉంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 350 రూపాయలు మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయల మేర పెరిగింది.

ఢిల్లీలో నేడు బంగారం ధరలిలా

ఢిల్లీలో నేడు బంగారం ధరలిలా

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,500గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే నేడు వంద రూపాయల మేర ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57, 270 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే 60 రూపాయల మేర నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుదలను నమోదు చేసింది.

రోజురోజుకీ పెరుగుతున్న బంగారం ధరలు

రోజురోజుకీ పెరుగుతున్న బంగారం ధరలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పటివరకు 52,350 గా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 57, 110 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. జాతీయ గాను, అంతర్జాతీయంగానూ చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

త్వరలో 60 వేలకు చేరొచ్చని నిపుణుల అంచనా

త్వరలో 60 వేలకు చేరొచ్చని నిపుణుల అంచనా

త్వరలో బంగారం ధరలు 60 వేల రూపాయలను తాకొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా పసిడి రికార్డు ధరలను నమోదు చేయడం పసిడి ప్రియులను షాక్ కు గురిచేస్తుంది. ఇక ఈ సంవత్సరం మొదటి నుండి ఇప్పటివరకు బంగారం పెరుగుదలను చూసినట్లయితే ఇది మరింత పైపైకి దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది తప్ప, తగ్గుతుందన్న భావన ఎవరిలోనూ వ్యక్తం కావడం లేదు. ఈ నెలలో ఇప్పటివరకు ఒకటి రెండు సందర్భాలు మినహాయించి బంగారం ధరలు తగ్గిన దాఖలాలు లేవు. ఒకవేళ ధరలు తగ్గినా వంద రూపాయలు తగ్గితే, పెరిగితే ఏకంగా 200, 300 రూపాయలు మేర పెరగడం గమనార్హం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *