Saturday, May 14, 2022

జైల్లో సెక్సువల్ టార్చర్?: నడవ లేని స్థితికి: మరో ఉద్యమకారిణికి బెయిల్

National

oi-Chandrasekhar Rao

|

చండీగఢ్: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు, నిరసనల వ్యవహారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వరుసగా రెండో రోజూ చుక్కెదురైంది. రైతులకు మద్దతుగా గళం విప్పిన దళిత యువతి, కుల వివక్ష వ్యతిరేక పోరాట ఉద్యమ కార్యకర్త నవ్‌దీప్ కౌర్‌కు బెయిల్ లభించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జస్టిస్ అవనీష్ ఝింగన్ ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది.

ఇప్పటికే మూడుసార్లు ఆమె బెయిల్ పిటీషన్‌ తిరస్కరణకు గురైన నేపథ్యంలో.. తాజాగా హైకోర్టు ఎలాంటి తీర్పును వినిపిస్తుందనేది ఉత్కంఠతకు గురి చేసింది. ఆమెకు బెయిల్ లభించడంతో తోటి సామిజక, ఉద్యమ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. రైతు ఉద్యమంతో ముడిపడి ఉన్న టూల్‌కిట్ వ్యవహారంలో అరెస్టయిన బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దిశ రవికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న పర్యావరణ కార్యకర్త శంతను ములుక్‌కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 Activist Nodeep Kaur granted bail by Punjab & Haryana High Court

ఇదే క్రమంలో తాజాగా నవ్‌దీప్‌ కౌర్‌కు బెయిల్ మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె కర్నాల్ జైలులో ఉన్నారు. నవ్‌దీప్‌ కౌర్‌.. పంజాబ్‌కు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి. నాలుగు నెలల కిందటే ఆమె ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో చేరారు. ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమిస్తున్న సొంత రాష్ట్రానికి చెందిన రైతులకు మద్దతు పలికారు. వ్యవసాయ చట్టాలపై నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కిందటి నెల అరెస్ట్ అయ్యారు.

జైల్లో ఆమె చిత్రవధను ఎదుర్కొన్నారనే ప్రచారం ఉంది. అరెస్టయిన మరుసటి రోజే ఆమె నడవలేని స్థితికి చేరుకున్నారని, దీనికి కారణం పోలీసులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమేననే వార్తలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సమీప బంధువు మీనా హ్యారిస్ సైతం ట్వీట్ చేశారు. తాజాగా- నవ్‌దీప్ కౌర్‌కు బెయిల్ లభించడం పట్ల మీనా హ్యారిస్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్లను ఆమె రీట్వీట్ చేశారు. రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఇద్దరు యువతులు నవ్‌దీప్ కౌర్, దిశరవి చట్టపరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారికి బెయిల్ లభించడం సంతోషాన్నిస్తోందంటూ తాజాగా ట్వీట్ చేశారు.

 Activist Nodeep Kaur granted bail by Punjab & Haryana High Court
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe