Tyre Stocks: ఇవాళ్టి (గురువారం, 05 జనవరి 2023) వీక్‌ మార్కెట్‌లోనూ టైర్‌ కంపెనీల స్టాక్స్‌ దౌడు తీశాయి. ముడిసరుకు ధర పడిపోవడంతో, టైర్‌ కంపెనీల మార్జిన్‌లు మెరుగుపడతాయనే అంచనాలతో షేర్‌ ధరలు పరుగులు పెట్టాయి.

ఇండివిడ్యువల్‌గా చూస్తే… బాలకృష్ణ ఇండస్ట్రీస్ (Balkrishna Industries) స్క్రిప్‌ 5 శాతం ర్యాలీ చేసి రూ. 2,222 వద్దకు చేరుకుంది. 55,000 MTPA (మెట్రిక్‌ టన్స్‌ పర్‌ ఆనమ్‌) కార్బన్ బ్లాక్ ప్రాజెక్ట్ & పవర్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టు 2022 డిసెంబర్ 31న పూర్తయిందని ఈ కంపెనీ ఇటీవల ప్రకటించింది.

అపోలో టైర్స్ (Apollo Tyres) స్టాక్‌ కూడా ఈ రోజు ఇంట్రా డే ట్రేడ్‌లో, BSEలో, 5 శాతం పెరిగి రూ. 335.90 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. బలమైన ఆదాయ వృద్ధిని నివేదించిన తర్వాత, గత ఆరు నెలల కాలంలో ఈ స్టాక్ 80 శాతం లాభపడింది. ప్యాసింజర్ వెహికల్స్‌ (PV) కోసం బలంగా పెరిగిన డిమాండ్, కమర్షియల్ వెహికల్స్‌ (CV) కోసం కొనసాగుతున్న డిమాండ్‌ కారణంగా.. ఈ కంపెనీ ఆదాయం & లాభ వృద్ధి మీద మార్కెట్‌ బుల్లిష్‌గా ఉంది.

మౌలిక సదుపాయాలపై నిరంతర వ్యయం, మెరుగు పడిన ఫ్లీట్‌ వినియోగం, లాభదాయకత, ఆటో ఎక్స్‌పో 2023లో ప్లాన్ చేసిన కొత్త లాంచ్‌లు, బలమైన ఆర్డర్ బుక్‌ వంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని.. టైర్‌ స్పేస్‌ను ICICI సెక్యూరిటీస్ ఆశాజనకంగా చూస్తోంది. PV & CV స్పేస్‌లో ఆరోగ్యకరమైన అమ్మకాలు కొనసాగుతాయని ఆశిస్తోంది. ద్వి చక్ర వాహనాల (2 Wheeler‌) కేటగిరీలో ప్రీమియమైజేషన్ ట్రెండ్ సమీప కాలంలో కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.

News Reels

అనుకూల తీర్పు
దీనికి తోడు, ఒక నెల క్రితం, అప్పిలేట్ ట్రిబ్యునల్ NCLAT నుంచి కూడా టైర్‌ కంపెనీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దేశీయ టైర్ కంపెనీలు సిండికేట్‌గా మారి, అన్యాయపూరితంగా ధరలు నిర్ణయించాయన్న ఆరోపణల మీద గతంలో దర్యాప్తు చేసిన కాంపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI), కొన్ని టైర్‌ కంపెనీల మీద జరిమానా విధించింది. ఆ టైర్‌ కంపెనీలు NCLATని ఆశ్రయించాయి. దేశీయ టైర్‌ పరిశ్రమను కాపాడడానికి, అనుకోని లోపాలను పునఃపరిశీలించడంతో పాటు జరిమానాను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో NCLAT పేర్కొంది. టైర్ కంపెనీల కార్టెలైజేషన్ ఆరోపణలపై తాజా ఉత్తర్వులు జారీ చేయాలని పోటీ కమిషన్‌ను ఆదేశించింది. 

మధ్యాహ్నం 2.05 గంటల సమయానికి, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 496.04 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 60,170.70 వద్ద ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121.85 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 17,931.15 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *