Monday, November 29, 2021

టీఆర్ఎస్‌కు కీలక నేత గుడ్‌బై… కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన సామ వెంకట్ రెడ్డి…

Telangana

oi-Srinivas Mittapalli

|

టీఆర్ఎస్‌‌ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత సామ వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సామ వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్‌తో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కనీస వేతనాల బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. బుధవారం(జులై 21) ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను వెంకట్ రెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ప్రైవేట్ సెక్టార్‌లోనూ స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించేలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు రానప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు.

sama venkat reddy quits trs and soon joining with congress

ప్రైవేట్ సెక్టార్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్ అమలుచేయాలన్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన కరువైందన్నారు. పరిశ్రమలు,పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా ఉండటం తప్ప ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఇంజనీరింగ్ చదివిన యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు లోనవుతున్నారని అన్నారు.టీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారులు విసుగు చెందే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో… ఆ ఆశయాలను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సామ వెంకట్ రెడ్డి కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌తో పనిచేస్తారని చెప్పారు.

English summary

TRS key leader Sama Venkat Reddy has resigned from the party. Announced that he was joining the Congress party. Sama Venkat Reddy has been with the TRS since the time of the Telangana movement. He is currently the Chairman of the Telangana Minimum Wages Board.

Story first published: Wednesday, July 21, 2021, 21:36 [IST]


Source link

MORE Articles

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

The best Cyber Monday deals happening now

Black Friday is technically over, but many of the same deals have carried over into Cyber Monday — plus a few...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe