Saturday, April 17, 2021

టీఆర్ఎస్‌కు గెలవలేమన్న భయం.. వాళ్ల విమర్శలకు స్పందించాల్సిన స్థాయి కాదు.. జానారెడ్డి కీలక వ్యాఖ్యలు…

టీఆర్ఎస్‌కు గెలవలేమన్న భయం..: జానారెడ్డి

సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తే తాను స్పందిస్తానని జానారెడ్డి అన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా సాగర్‌లో గెలవలేమన్న భయంతోనే… తనపై అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా,ప్రజలను ప్రలోభ పెట్టకుండా ఎన్నికలకు రావాలని ప్రతిపాదన చేస్తే ఇంతవరకూ టీఆర్ఎస్ నేతలు స్పందించలేదన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ప్రతిపాదన చేశానని చెప్పారు. కానీ టీఆర్ఎస్ మాత్రం అందుకు వెనకడుగు వేస్తోందన్నారు.

ప్రజలను ప్రలోభ పెడుతున్నారు : జానారెడ్డి

ప్రజలను ప్రలోభ పెడుతున్నారు : జానారెడ్డి

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా మద్యం పంపిణీతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తోందని జానారెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతల తీరు చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఉపఎన్నికలో తనదే విజయం నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని… టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తారని చెప్పారు.

ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్

ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్

మరోవైపు సాగర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. దాదాపు ముగ్గురు మంత్రులు,12 మంది ఎమ్మెల్యేలు సాగర్‌లోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గడపగడపకూ వెళ్లి టీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు,రోడ్ షోలతో స్థానిక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్‌లో పరిస్థితి పూర్తిగా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉందని… సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తామే దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ తరుపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ ఇక్కడినుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న సాగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా…. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.


Source link

MORE Articles

అమెరికా కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు.. సంతాపంగా వైట్ హౌస్‌పై జాతీయ జెండా అవనతం…

మృతుల వివరాలు.. 'ఇది అత్యంత హృదయవిదారక సంఘటన.ఈ ఘటనతో సిక్కు కమ్యూనిటీ దిగ్భ్రాంతికి గురైంది.' అని ఇండియానా పోలిస్‌లోని సిక్కు కమ్యూనిటీ నేత గురీందర్ సింగ్...

కరోనా : సందేహాలు, సమాధానాలు

ప్రస్తుతం గాలి ద్వారా కూడా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వెవ్ బలంగా ఉంది. పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు చేయకుండానే ప్రతిరోజు రెండు లక్షల...

Peloton is fighting a recall request on its treadmill after a child died last month

Peloton is resisting a request from the Consumer Product Safety Commission (CPSC) to recall its Tread Plus treadmill, which was involved...

Yes, Twitter was down — at least on the East Coast | Engadget

These days, fail whale sightings are few and far between, but Twitter appears to be suffering a serious outage at the moment. It's...

Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese twin Douyin had 610-620M DAUs...

Zheping Huang / Bloomberg: Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese...

Squarespace files to go public – TechCrunch

Squarespace is going public, Apple shares some music payment details and Twitter bans the founder of the right-wing media organization Project Veritas. This...

వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం

షర్మిల పార్టీ నుంచి పిలుపు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ,...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe