Thursday, June 17, 2021

టీడీపీకి బిగ్ షాక్… వైసీపీ ఎమ్మెల్యేతో ఏడుగురు విశాఖ కార్పోరేటర్ల భేటీ… వివరణ కోరిన పార్టీ అధిష్టానం…

Andhra Pradesh

oi-Srinivas Mittapalli

|

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత పతన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2019లో సాధారణ ఎన్నికలు మొదలు తాజా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకూ ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీకి వైసీపీ చేతిలో చావు దెబ్బ తప్పలేదు. పార్టీ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్న వేళ కింది నుంచి పైస్థాయి వరకూ క్యాడర్ అంతా ఢీలా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్లుగా టీడీపీకి మరో షాక్ తగిలింది.

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో ఇటీవల టీడీపీ తరుపున గెలిచిన ఏడుగురు కార్పోరేటర్లు శుక్రవారం(మార్చి 19) గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు. తమ డివిజన్ల పరిధిలో అభివృద్దికి సహకరించాలని ఈ సందర్భంగా కార్పోరేటర్లు ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని… అన్ని డివిజన్ల అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

vizag seven tdp corporators meet ysrcp mla tippala nagireddy tdp seeks explanation

ఎమ్మెల్యేను కలిసినవారిలో 86వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోటేశ్వరరావు, పి.శ్రీను (67వ డివిజన్‌), జి.శ్రీనివాస్ (76వ డివిజన్‌), ముత్యాలనాయుడు (88వ డివిజన్‌), వి.జగన్ (87వ డివిజన్‌)‌, లక్ష్మీబాయి (75వ డివిజన్‌), ఆర్‌.శ్రీనివాస్‌(79వ డివిజన్‌) ఉన్నారు.

మరోవైపు ఈ పరిణామంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో ఎందుకు భేటీ అయ్యారో వివరణ ఇవ్వాలని కోరింది. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వనిపక్షంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులైన గడవకముందే టీడీపీ కార్పోరేటర్లు ఇలా వైసీపీ ఎమ్మెల్యేని కలవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైన వేళ… గెలిచిన కొద్దిపాటి కార్పోరేటర్లు కూడా పార్టీ ఫిరాయిస్తారేమోనన్న టెన్షన్ టీడీపీలో అలజడి రేపుతోంది.

కాగా,ఇటీవలి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. మొత్తం 98 స్థానాల్లో 58 చోట్ల గెలుపొంది గ్రేటర్‌ పీఠంపై పార్టీ జెండా ఎగరవేసింది. 30 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.విశాఖ మేయర్‌ అభ్యర్థిగా గొలగాని వెంకట హరికుమారిని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్న కార్పోరేటర్ వంశీకృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు.
Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe