టీలో చక్కెరకు బదులుగా ఇది వేస్తే.. ఆరోగ్యానికి మంచిది..!

[ad_1]

Best Sweetener to use: చాలా మందికి ఉదయం లేవగానే టీ/కాఫీ తాగనిదే.. రోజు స్టార్ట్‌ అవ్వదు. రోజు మధ్యలోనూ.. టీ కాఫీ తాగి బాడీని యాక్టివ్‌ చేస్తారు. కానీ, టీ/కాఫీలో వేసే చక్కెర స్లో పాయిజన్‌లా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర అధికంగా తీసుకుంటే.. శరీరంలోకి అధిక మొత్తంలో కొవ్వు పెరుగుతుంది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు. అధిక బరువు కారణంగా.. హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తీపి ఎక్కువగా తింటే.. కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని చాలామంది.. టీ/కాఫీలో చక్కెర స్కిప్‌ చేసి తీసుకుంటూ ఉంటారు. చక్కెరకు అల్టర్‌నేటివ్‌గా.. తేనె, బెల్లం, పటిక బెల్లం వేసుకుంటూ ఉంటారు. అసలు చక్కెరకు బదులు.. వీటిలో ఏది తీసుకుంటే మంచిది? ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే అంశం గురించి ఆయుర్వేద డాక్టర్‌ వరలక్ష్మి మనకు వివరించారు.

తేనె..

చాలా మంది.. చక్కెరకు అల్టర్‌నేటివ్‌గా తేనె వాడుతూ ఉంటారు. తేనె గొప్ప ఔషధంలానూ పని చేస్తుంది. తేనె తీసుకుంటే.. శ్లేష్మం, కఫం కరుగుతాయి. దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తెనె ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ.. టీ/కాఫీలో దీనిని వేసుకోకూడదని ఆయుర్వేద వైద్యురాలు వరలక్ష్మి అన్నారు. తేనె వేడి చేస్తే.. విషంగా మారుతుంది. అదే సమయంలో, దీన్ని వేడి పదార్థాలతో కూడా కలపకూడదు.

బెల్లం..

పంచదారకు బదులుగా చాలా మంది బెల్లం వాడుతుంటారు. దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్సు, సి, బి2, ఈ.., లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. అజీర్తి, మలబద్దకం, నెలసరిలో చిక్కులు, రక్తహీనత లాంటి సమస్యలకు బెల్లం చెక్‌ పెడుతుంది. రోజూ కొంచెం బెల్లం తినడంతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కానీ, బెల్లాన్ని.. టీ/కాఫీలో వేసుకోకూడదని ఆయుర్వేద వైద్యురాలు వరలక్ష్మి అన్నారు. పాలు బెల్లం కలిపి తీసుకోకూడదని.. బెల్లం స్వభావం వేడిగా ఉంటుంది, పాలు చల్లగా ఉంటాయి. ఈ కారణంగా రెండూ కలిపి తీసుకోకూడదు. ఇవి రెండూ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పటిక బెల్లం..

పటిక బెల్లం.. చక్కెరకు బెస్ట్‌ అల్టర్‌నేటివ్‌ అని ఆయుర్వేద వైద్యురాలు వరలక్ష్మి అన్నారు. దీన్ని టీ/కాఫీలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చని చెప్పారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. పంచదారను ప్రాసెస్‌ చెయ్యడానికి ముందు రూపమే పటికబెల్లం. దీనిని కలకండ అని కూడా అంటారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *