Saturday, July 24, 2021

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

కొత్త 2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్ అప్‌గ్రేడెడ్ డిజైన్ మరియు ఫీచర్లతో రావచ్చని సమాచారం. కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను స్పెషల్ ఎడిషన్‌గా విడుదల చేస్తారా లేక కేవలం కొత్త కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

టీజర్‌లో చూపించిన ఫొటో ప్రకారం, ఈ బైక్ జనవరి 2020లో విడుదలైన బిఎస్6 స్టార్ సిటీ ప్లస్ మాదిరిగానే కనిపిస్తుంది. టీవీఎస్ ఈ పాపులర్ బైక్‌ను కొత్త డిజైన్ మరియు బిఎస్6 ఇంజన్‌తో గతేడాది జనవరిలో మార్కెట్లో విడుదల చేసింది.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

కొత్త స్టార్ సిటీ ప్లస్‌లో పెద్ద ఎల్‌ఈడీ హెడ్‌లైట్, పెద్ద హెడ్‌లైట్ కౌల్, కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు ఫీచర్ అప్‌డేట్‌లు ఉన్నాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌లో ఉపయోగించిన బిఎస్6 ఇంజన్ ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది మునుపటి కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

టీవీఎస్ తమ అపాచీ సిరీస్ బైక్‌లలో కూడా ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కొత్తగా చేసిన అప్‌డేట్స్‌లో భాగంగా, ఈ బైక్‌లో యుఎస్‌బి మొబైల్ ఛార్జర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 5-స్టెప్ అడ్జస్టబల్ రియర్ సస్పెన్షన్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

ఈ మోటార్‌సైకిల్‌లో ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో ఉపయోగించిన బిఎస్6 109సిసి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ గరిష్టంగా 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

సిటీలో కానీ లేదా పల్లెల్లో కానీ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని మెయింటినెన్స్ మరియు రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బైక్ లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ధర రూ.65,865 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మరి ఈ కొత్త వేరియంట్ ధరను కంపెనీ ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి. ఈ కొత్త బైక్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల

టీవీఎస్ మోటార్ గడచిన జనవరి 2021లో మొత్తం 2,94,596 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జనవరి 2020లో) కంపెనీ అమ్మకాలు 2,05,216 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 26 శాతం పెరిగాయి.
Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe