Saturday, July 24, 2021

టూల్‌కిట్ కేసు: మరో 3 రోజులపాటు దిశ రవి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

National

oi-Rajashekhar Garrepally

|

న్యూఢిల్లీ: స్వీడన్ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘టూల్‌కిట్’ కేసులో అరెస్టైన దిశ రవికి మరో మూడు రోజులపాటు జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూ పటియాలా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం దిశ రవిని కోర్టులో హాజరుపర్చిన ఢిల్లీ పోలీసులు మరో మూడు రోజులపాటు ఆమె కస్టడీని కోరారు.

ఫిబ్రవరి 22న ఈ కేసులో సహ నిందితుడైన శంతను ములుక్‌తో కలిపి విచారణ చేసేందుకు కస్టడీని పొడిగించాల్సిందిగా పోలీసుల తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. టూల్‌కిట్‌ను రూపొందించడంలో పర్యావరణ కార్యకర్త దిశ రవితోపాటు నికిత జాకబ్, శంతనుములుక్‌లు భాగస్వాములని ఢిల్లీ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నికిత, శంతను ట్రాన్సిట్ బెయిల్‌పై ఉన్నారు.

 Toolkit Case: Climate Activist Disha Ravi Sent to Judicial Custody for Three More Days

టూల్‌కిట్ కేసులో ఢిల్లీ హైకోర్టు పోలీసులు మీడియాకు కీలక సూచనలు

పర్యావరణ కార్యకర్త దిశ రవి అరెస్ట్, టూల్ కిట్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలకు సంబంధించిన ‘టూల్‌కిట్’ వ్యవహారంలో అరెస్టైన దిశ రవికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇతర దర్యాప్తునకు సంబంధించి లీకైన వివరాలను ప్రచురించొద్దని మీడియాను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఆ సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకుని, దాని వల్ల దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల దర్యాప్తునకు ఆటంకాలు కలగవచ్చని అభిప్రాయపడింది. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కు సంబంధించి ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయకుండా చూడాలంటూ దిశ రవి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ప్రతిభా సింగ్ ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారించింది.

అయితే, ఇప్పటి వరకు ప్రచురితమైన వార్తల్ని, పోలీసులు చేసిన ట్వీట్లు తొలగించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్ అభ్యన్థనను మాత్రం ధర్మాసనం పరిగణిలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి గతంలో ప్రచురించిన కొన్ని వార్తలు సంచలనాత్మకంగా, పక్షపాతపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మీడియాతోపాటు ఢిల్లీ పోలీసులకు కూడా హైకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. మీడియాకు సమాచారాన్ని లీక్ చేయలేదంటూ దాఖలు చేసిన ప్రమాణపత్రానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తుపై చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.


Source link

MORE Articles

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !

భర్తతో హ్యాపీలైఫ్ ఉత్తరప్రదేశ్ లోని బరాచ్ జిల్లాలోని కొట్వాలి నన్సారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరియా గ్రామంలో రాజేష్ సింగ్, రీటా (32) దంపతులు నివాసం ఉంటున్నారు....

Here Are All the Games That Support Nvidia’s RTX Ray Tracing | Digital Trends

With a Nvidia RTX 30 series or 20 series graphics card, you can take advantage of RTX ray tracing. Only certain games support...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe