Friday, July 30, 2021

టేబుల్‌పై డెడ్ బాడీ.. పోస్టుమార్టమ్‌‌కి సిద్దం,ఇంతలోనే ఊహించని షాక్… ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్…

అసలేం జరిగింది…

కర్ణాటకకు చెందిన శంకర్‌ గోంబి అనే యువకుడు గత నెల 27న మహాలింగాపూర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బెల్గావి ప్రభుత్వ ఆస్పత్రిలో అక్కడి వైద్యులు అతన్ని

రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. చివరకు బ్రెయిన్ డెడ్‌గా నిర్దారించారు. దీంతో సోమవారం(మార్చి 1) మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో శంకర్ కుటుంబ సభ్యులు ఇంటి వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

టేబుల్‌పై డెడ్ బాడీ...

టేబుల్‌పై డెడ్ బాడీ…

పోస్టుమార్టమ్‌కు అంతా సిద్దం చేసి మృతదేహాన్ని టేబుల్‌పై పెట్టారు. వైద్యుడు ఎస్ఎస్ గల్‌గాలి ఆ టేబుల్ వద్దకు వచ్చి పోస్టుమార్టమ్ ప్రక్రియ మొదలుపెట్టేందుకు మృతదేహాన్ని తాకాడు. అంతే…ఒక్కసారిగా టేబుల్‌పై ఉన్న మృతదేహంలో చలనం కనిపించింది. అతని శరీరంపై రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చేతులు కూడా మెల్లిగా కదలడం కనిపించింది. మరికొద్ది నిమిషాల్లో ఆ శరీరంపై కత్తి గాట్లు పడుతాయనగా… ఒక్కసారిగా చలనం రావడం వైద్యుడినే షాక్‌కి గురిచేసింది. కాసేపటికి తేరుకున్న డా.గల్‌గాలి ఆస్పత్రిలోని ఇతర సిబ్బందికి,శంకర్ గోంబి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.

గుండె కొట్టుకుంటున్నట్లు నిర్దారణ

గుండె కొట్టుకుంటున్నట్లు నిర్దారణ

అనంతరం శంకర్ గోంబీకి వైద్య పరీక్షలు నిర్వహించగా అతని గుండె కొట్టుకుంటున్నట్లు నిర్దారణ అయింది. దీంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ శంకర్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై డా.గల్‌గాలి మాట్లాడుతూ… తన 18 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి కేసును చూడలేదన్నారు. ఇప్పటివరకూ 400 పోస్టుమార్టమ్స్ చేశానని చెప్పిన ఆయన… ఈ కేసు తననే షాక్‌కి గురిచేసిందన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి స్మశానానికి తరలిస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చొన్నాడు. ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మదనపల్లె గ్రామీణ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.


Source link

MORE Articles

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

AMD announces the Radeon RX 6600 XT, a $379 “1080p beast” that arrives on August 11

What just happened? After months of rumors, leaks, and speculation, AMD...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe