డాక్టర్ చెప్పిన.. చిట్కాలతో మలబద్ధకం ఒక రోజులో తగ్గుతుంది..!

[ad_1]

How To Get Rid Of Constipation: మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. చెడు ఆహార అలవాట్లు, తగినంత పీచు తీసుకోకపోవటం, నీరు తాగకపోవటం, నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆల్కహాల్‌, స్మోకింగ్‌, అతిగా తినడం, కొన్ని రకాల ఔషధాల ప్రభావం కారణంగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మలబద్ధకం చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. పైల్స్‌, ఆసన క్యాన్సర్‌ (Anal cancer), కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మలబద్ధకం సమస్యను పరిష్కరించడానికి.. ద్రవ, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కాన్స్టిపేషన్‌ను.. తగ్గించడానికి ట్యాబ్లెట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి బదులుగా.. కొన్ని ఆయుర్వేద హోం రెమిడీస్‌ ప్రయత్నించడం మంచిది. మలబద్ధకం సమస్యను దూరం చేసి, పేగు కదలికలను సులభతరం చేసే.. కొన్ని రెమిడీస్‌ను ఆయుర్వేద నిపుణులు కపిల్‌ త్యాగి మనకు వివరించారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. (Dr. Kapil Tyagi, director of ‘Kapil Tyagi Ayurveda Clinic’, located at E-260 Sector 27, Noida).

ఈ ఆహారం తీసుకోండి..

ఈ ఆహారం తీసుకోండి..

ఆయుర్వేదం ప్రకారం, ‘వాత’ దోషం మనస్సు, శరీర అన్ని విధులను నియంత్రిస్తుంది. వాత నియంత్రణకు, సమతుల్య ఆహారం తీసుకోవాలని అన్నారు. తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. మీ డైట్‌లో ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే.. ఫుడ్‌ తీసుకోవాలి. స్మూత్‌గా ఉండే.. ఆహారం ప్రిఫర్‌ చేయాలి. ఎప్పుడూ వేడి ఆహారాలు, వేడి పానీయాలు, బాగా ఉడికించిన కూరగాయలను తీసుకోండి. (Image source – pixabay)

త్రిఫల..

త్రిఫల..

ఆయుర్వేదంలో.. మలబద్ధకం చికిత్సకు త్రిఫలను ఎక్కువగా వాడుతుంటారు. త్రిఫలలో ఉండే.. గ్లైకోసైడ్‌లకు భేదిమందు లక్షణాలు ఉంటాయి. త్రిఫలాలు అంటే.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. వీటితో చేసిన చూర్ణం మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ చూర్ణానికి యాంటీ ఏజింగ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికం. దీనిని నిద్ర పోయేముందు గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

సోంపు..

సోంపు..

మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ వేచిన సోంపు గింజల పొడి వేసుకుని తాగండి. ఫెన్నెల్ గింజలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తింటే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. (Image source – pixabay)

మారేడు పండు..

మారేడు పండు..

మారేడు పండులో భేదిమందు లక్షణాలు ఉంటాయి. మీరు మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. రాత్రి భోజనానికి ముందు అరకప్పు మారేడు గుజ్జులో ఒక చెంచా బెల్లం కలిపి తినండి. మీరు దీన్ని షర్బత్‌లా తయారు చేసుకోవచ్చు కూడా. ఇది జీర్ణవ్యవస్థను మెరుగు పర్చడానికి తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. మారేడు పండులో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానీకీ మేలు చేస్తాయి. (image source – pixabay)

అతిమధురం..

అతిమధురం..

అతిమధురంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ మూలకి.. పేలవమైన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో.. ఒక టీస్పూన్‌‌ అతిమధురం పొడి, ఒక టీస్పూన్ బెల్లం వెసి తాగండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. దీర్ఘకాలిక మలబద్ధకం నుంచి బయటపడవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *