[ad_1]
Paytm’s Loan: భారతదేశంలో అతి పెద్ద డిజిటల్ చెల్లింపులు & ఆర్థిక సేవల (digital payments and financial services) సంస్థల్లో ఒకటైన పేటీఎం, 2022 డిసెంబర్ నెలలో బ్రహ్మాండమైన బిజినెస్ చేసింది. రుణాల పంపిణీలో గత సంవత్సరం కంటే (YoY) ఈసారి 330 శాతం వృద్ధిని సాధించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, డిసెంబర్‌లో రూ. 3,665 కోట్ల విలువైన 3.7 మిలియన్ (37 లక్షలు) రుణాలను పంపిణీ చేసింది.
“2022 డిసెంబరులో రుణాల సంఖ్య 117 శాతం YoY వృద్ధితో 3.7 మిలియన్లకు పెరిగింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో 137 శాతం YoY వృద్ధితో 10.5 మిలియన్లకు రుణాలు పెరిగాయి” అని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ పేర్కొంది.
మూడున్నర రెట్ల రుణ వృద్ధి
2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ కాలం) రూ. 2,181 కోట్ల విలువైన రుణాలను ఈ కంపెనీ మంజూరు చేసింది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో రుణ విలువ 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరుకుంది. అంటే, ఒక్క ఏడాది కాలంలోనే మూడున్నర రెట్ల రుణ వృద్ధిని పేటీఎం సాధించింది.
నెలవారీ వినియోగదారుల సంఖ్య (monthly transacting users – MTU) కూడా గత ఏడాది కంటే గణనీయంగా పెరిగింది. 2021 డిసెంబర్‌లోని 64 మిలియన్లుగా MTU, 2022 డిసెంబర్ నాటికి 32 శాతం పెరిగి 85 మిలియన్లకు చేరుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాసెస్ చేసిన మర్చంట్ గ్రాస్ బిజినెస్ వాల్యూ(GMV) డిసెంబర్‌లో 38 శాతం వృద్ధితో రూ. మొత్తం రూ. 3.46 ట్రిలియన్లకు చేరుకుంది.
News Reels
2022 డిసెంబర్‌లో, ముంబైలో జరిగిన ఒక సమ్మిట్‌లో Paytm CEO & ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడారు. వ్యాపారంలో ఇకపై నగదు బర్న్ ఉండదని, ఖర్చులను తగ్గించాలన్న లక్ష్యంలో కంపెనీ చాలా ముందుందని చెప్పారు. ఎక్సేంజ్ ఫైలింగ్ కంపెనీ అప్‌డేట్ చేసిన డిసెంబర్ లావాదేవీల సమాచారాన్ని బట్టి చూస్తే, విజయ్ శేఖర్ శర్మ చెప్పింది నిజమేనని అనిపిస్తోంది.
త్రైమాసిక ఆదాయ నివేదిక ప్రకారం… 2022 సెప్టెంబర్ చివరి నాటికి నికర నగదు, నగదు సమానమైనవి, పెట్టుబడి పెట్టదగిన బ్యాలెన్స్ రూ. 91.82 బిలియన్లు కంపెనీ వద్ద ఉంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEOగా సురీందర్ చావ్లాను నియమించేందుకు, బ్యాంకింగ్ రెగ్యులేటర్ RBI నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ అనుమతి పొందింది. అయితే, కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్ మీద నిషేధం కొనసాగుతోంది.
2022 డిసెంబర్ 23 నాటి కనిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు (09 జనవరి 2023) ఈ స్టాక్ 18% పైగా పుంజుకుంది. గత నెల రోజుల కాలంలో 3% పైగా లాభపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link