News
oi-Mamidi Ayyappa
Jeet Adani: భారత వ్యాపార కుటుంబాల్లో ఇటీవల వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. మెున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగటం మరువక ముందే తాజాగా గౌతమ్ అదానీ ఇంట కూడా పెళ్లి బాజాలు మోగాయి.
పారిశ్రామిక వేత్త, భారత కుబేరుడు గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ డైమండ్ వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షాతో మార్చి 12 ఆదివారం ఇది జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్థానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

జీత్ అదానీకి భార్య కాబోతున్న దివా ప్రఖ్యాత C.Dinesh & Co Pvt Ltd యజమాని వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. జీత్-దివాల నిశ్చితార్థం ప్రైవేట్ వ్యవహారం కాబట్టి వేడుక గురించి చాలా తక్కువ వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ జంట నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో జంట సాంప్రదాయ దుస్తులను ధరించి కనిపించారు.
దివా ఎంబ్రాయిడరీ లెహంగాలో అద్భుతమైన పాస్టెల్ బ్లూ దుపట్టాతో అందంగా కనిపించగా.. జీత్ అదానీ పాస్టెల్ బ్లూ కుర్తా సెట్‌లో లైట్ హ్యూడ్ ఎంబ్రాయిడరీ జాకెట్‌లో కనిపించారు. జీత్ అదానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి తన చదువును పూర్తి చేశారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరగా.. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జీత్ అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది అదానీ గ్రూప్ వ్యాపారాల వినియోగదారులందరికీ అందించడానికి ఒక సూపర్ యాప్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
English summary
Jeet adani and Diva Jaimin Shah engagement event held privately with close family mates, friends
Jeet adani and Diva Jaimin Shah engagement event held privately with close family mates, friends
Story first published: Tuesday, March 14, 2023, 15:35 [IST]