Sunday, July 25, 2021

డోనల్డ్ ట్రంప్: ఓటమి తరువాత తొలిసారిగా ప్రసంగించిన అమెరికా మాజీ అధ్యక్షుడు.. కొత్త పార్టీ ఏర్పాటుపై వివరణ

International

-BBC Telugu

By BBC News తెలుగు

|

Donald Trump

వైట్ హౌస్ విడిచి పెట్టిన తరువాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ప్రసంగించారు.

అభిశంసన విచారణలో ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో కొందరు రిపబ్లిక్ పార్టీ సభ్యులు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో, ట్రంప్ కొత్త రాజకీయ పార్టీ పెడతారనే వార్తలొచ్చాయి.

అయితే, తనకు అలాంటి ఉద్దేశమేమీ లేదని ట్రంప్ సీపీఏసీ ప్రసంగంలో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను విమర్శిస్తూ ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని ‘అమెరికా లాస్ట్’‌కు దిగజార్చారని అన్నారు.

సీపీఏసీ అనేది అమెరికాలో సాంప్రదాయ సిద్ధాంతాలను విశ్వసించేవారు, కార్యకర్తలు, అధికారులు పాల్గొనే ఒక రాజకీయ వార్షిక సమావేశం. ఈసారి జరిగిన సమావేశంలో ట్రంప్ విధేయులు అనేకమంది పాల్గొన్నారు.

జనవరిలో అమెరికా క్యాపిటల్ హిల్ మీద జరిగిన దాడుల తరువాత ట్విట్టర్, ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా వేదికలు ట్రంప్‌పై నిషేధం విధించాయి.

సమావేశంలో ట్రంప్ విధేయులు అనేకమంది పాల్గొన్నారు.

ట్రంప్ ప్రసంగం ముఖ్యాంశాలు

నాలుగేళ్ల క్రితం తాము మొదలుపెట్టిన ప్రయాణం ముగియలేదని.. తమ పార్టీ భవిష్యత్తు, తదుపరి తీసుకోబోయే చర్యలు, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడడానికే ఇక్కడకు వచ్చానని ట్రంప్ అన్నారు.

తాను కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నానే ఊహాగానాలను ట్రంప్ కొట్టి పారేశారు. అదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.

“కొత్త పార్టీ ప్రారంభిస్తే, మా ఓట్లు చీలిపోతాయి. అలా అయితే మేము ఎప్పటికీ గెలవలేం. రిపబ్లికన్ పార్టీ ఇంతకుముందు కంటే బలంగా, ఐక్యంగా ఉంటుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు.

రిగ్గింగ్ వలనే ఎన్నికల్లో తాను ఓడిపోయానని ట్రంప్ అన్నారు.

జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ, వలసలకు సంబంధించిన పాలసీలను దుయ్యబట్టారు.

“బైడెన్ పాలన ఎలా ఉండబోతోందో మనందరికీ తెలుసు. ఆయన హయాంలో ఎంత చెడు జరుగబోతోందో ఎవరూ ఊహించలేరు. వామపక్ష ప్రభుత్వం ఎంతకైనా తెగించగలదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అమెరికాలో ట్రంప్‌కు ఆదరణ తగ్గలేదు. గత వారం అమెరికాలో జరిపిన ఒక సర్వేలో ట్రంప్ మూడో పార్టీ పెడితే 46 శాతం ఓటర్లు వెంట వెళతారని తేలింది.

కాగా, 74 ఏళ్ల ట్రంప్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe