ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. – Navatelangana

Date:

Share post:


– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆరో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయాందోళన చెందిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో 8 ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. మంటల్లో ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ ప్రజలను కలవరపెడుతన్నాయి. ఇటీవలే ఎలక్ట్రిక్‌ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు యువకులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఇందులో మరో నలుగురికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...