Saturday, July 24, 2021

ఢిల్లీ : ప్రతీ ఐదు గంటలకో రేప్,19 గంటలకో మర్డర్.. షాకింగ్ క్రైమ్ డేటా…

2020లో మహిళలపై అత్యాచారాల డేటా..

మొత్తంగా 2020లో ఢిల్లీలో 1699 అత్యాచార ఘటనలు,2168 లైంగిక వేధింపుల ఘటనలు,చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు 65 చోటు చేసుకున్నాయి. 2019తో పోల్చితే 2020లో కేసులు స్వల్ప మేర తగ్గాయి. 2019లో మొత్తం 2168 అత్యాచార ఘటనలు,2921 లైంగిక వేధింపుల ఘటనలు,చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు 109 నమోదయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఢిల్లీలో మహిళలపై అన్ని రకాల నేరాలు తగ్గినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

రేప్ నిందితులు... బాధితులకు పరిచయమే..

రేప్ నిందితులు… బాధితులకు పరిచయమే..

ఢిల్లీలో 2019లో సగటున ఒకరోజులో 17 చైన్ స్నాచింగ్ ఘటనలు జరగ్గా… 2020లో ప్రతీ గంటకో స్నాచింగ్ జరిగినట్లు వెల్లడైంది. 2020లో నమోదైన అత్యాచార కేసుల్లో 1.77శాతం కేసుల్లో మాత్రమే నిందితులు బాధితులకు అపరిచితులని తేలింది. ఈ సంఖ్య 2019లో 2.20శాతంగా ఉంది. 2020లో నమోదైన మొత్తం 1699 అత్యాచార ఘటనల్లో 318 కేసుల్లో నిందితులు,బాధితులు సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్)లో ఉన్నట్లు తేలింది. పెళ్లికి నిరాకరించడం వల్లే బాధితులు అత్యాచార కేసులు పెట్టారు.

ఆ చర్యలతోనే సాధ్యమైందని...

ఆ చర్యలతోనే సాధ్యమైందని…

మహిళల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును ఉన్నత స్థాయిలో పర్యవేక్షించడం,నేరాలు జరిగే ప్రదేశాలను హాట్ స్పాట్స్‌గా గుర్తించి చర్యలు తీసుకోవడం,మహిళా పోలీసులను బీట్ కానిస్టేబుల్స్‌గా పంపించడం వంటి చర్యలతో 2020లో ఢిల్లీలో మహిళలపై నేరాలు తగ్గినట్లు కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు. గతేడాది లాక్‌డౌన్ కారణంగా దాదాపు 4 నెలల పాటు జనం ఇళ్ల నుంచి కదల్లేదు. బహుశా 2020లో క్రైమ్ రేటు తగ్గడానికి ఇది కూడా కారణమై ఉండవచ్చునని అంటున్నారు.

మహిళలపై నేరాల చిట్టా

మహిళలపై నేరాల చిట్టా

2019లో ఢిల్లీలో అన్ని రకాల నేరాలు కలిపి మొత్తం 3,16,261 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2020లో 2,66,070కి పడిపోయింది. 2019లో మహిళలపై 9365 నేరాలు జరగ్గా… 2020లో ఆ సంఖ్య 7322కి పడిపోయింది. అంటే 19శాతం మేర మహిళలపై నేరాలు తగ్గాయి. మహిళలపై నేరాల కేసుల్లో 90శాతం కేసులు పరిష్కారమైనట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టుల విషయానికొస్తే… 2019తో పోలిస్తే 2020లో 15.43శాతం మేర పెరిగాయి. 2019లో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా 2020లో 32 మందిని అరెస్ట్ చేశారు.


Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Arm Reveals Flexible, Non-Silicon PlasticArm Chip

Arm and PragmatIC revealed a new microprocessor, PlasticArm, built with "metal-oxide thin-film transistor technology on a flexible substrate" instead...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe