చాలా మందికి చిన్నతనంలో కానీ, పెద్దగా అయ్యాక కానీ, ఆటలాడుతున్నప్పుడు, జర్నీ చేసినప్పుడు తలకి దెబ్బ తగులుతుంటుంది. దీనిని కొంతమంది అలా వదిలేస్తారు. కానీ, దీని వల్ల భవిష్యత్‌లో బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు నిపుణులు. దెబ్బలు తగలడం వల్ల నరాలు, రక్తనాళాలపై ఎఫెక్ట్ పడి.. బ్రెయిన్‌లో కొన్ని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. దీని వల్ల బ్రెయిన్ పనితీరు తాత్కాలికగా కోల్పోతుంది. కొన్నిసార్లు దెబ్బ తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా బ్రెయిన్ పని చేయదు.

దెబ్బ తగిలినప్పుడు..

ఏదైనా దెబ్బ తగిలిన మొదట్లో అంతగా ఇబ్బంది ఉండదు. దీనికి అప్పటికప్పుడు ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకుంటాం. కానీ, రోజులు, వారం గడిచే కొద్దీ ఈ సమస్య పెరిగి తీవ్రత పెరుగుతుంది. ఇది డెమెన్షియాకి కారణంగా కూడా మారుతుంది.
Also Read : Osteoarthritis : ఉదయాన్నే మీ చేతులు గట్టిగా మారి నొప్పి ఉంటోందా.. అయితే మీ కోసమే..

డెమెన్షియా..

డెమెన్షియా..

డిమెన్షియా గురించి మీకు తెలుసా.. ఇది తలలో సమస్య కారణంగా వస్తుంది. ముఖ్యంగా తాజా పరిశోధనల ప్రకారం తలకి దెబ్బలు తగలడం వల్ల, 3 సార్లు ఏదైనా దెబ్బలు తగిలితే ఈ సమస్య వస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి చెబుతున్నారు.

పరిశోధకుల ప్రకారం..

పరిశోధకుల ప్రకారం..

తలకి మూడు సార్లు చిన్నపాటి ప్రమాదం, దెబ్బలు తగిలినా, ఒకేసారి తీవ్రమైన దెబ్బ తగిలిన వారికి ఈ ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగ్ ఆటలు ఆడుతున్నప్పుడు, యాక్సిడెంట్స్ సమయంలో తగిలిన దెబ్బల కారణంగా డెమెన్షియా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దెబ్బలు తగలడాన్ని బట్టి..

దెబ్బలు తగలడాన్ని బట్టి..

జీవితంలో మీకు ఎన్నిసార్లు బ్రెయిన్‌కి దెబ్బ తగులుతుందో.. మీ బ్రెయిన్ పనితీరు కూడా అంతే ఇబ్బందిగా ఉంటుందని పరిశోధన చేసిన డాక్టర్ వెనెస్సా రేమాంట్ చెప్పారు. చిత్తవైకల్యానికి తల గాయాలు ప్రధాన ప్రమాదకారకం అని చెబుతున్నారు ఈయన. కొన్నిసార్లు చిన్న ప్రభావం కూడా బ్రెయిన్ దెబ్బతినడానికి డెమెన్షియా రావడానికి కారణమవుతుందని ఆధారాలు చెబుతున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం ప్రకారం వ్యక్తులకి ఎన్నిసార్లు తలకి దెబ్బ తగిలిందని తెలుసుకుని వారి బ్రెయిన్ ఎగ్జామ్ స్కోర్‌ని పరీక్షించారు. వీటిని బట్టే దెబ్బల ఆధారంగా డెమెన్షియా వస్తుందని చెబుతున్నారు. ఈ వివరాలు జర్నల్ ఆఫ్ న్యూరో ట్రామాలో ప్రచురించారు.

నెమ్మదిగా ప్రభావం..

నెమ్మదిగా ప్రభావం..

తలకి తాకిన దెబ్బలు నెమ్మదిగా ఎఫెక్ట్‌ చూపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా తలకి దెబ్బ తాకిన వారు ఎక్కువగా ఆలోచించలేరు. పరిశోధకుల ప్రకారం.. ముఖ్యమైన ఘటనలు అనేవి బ్రెయిన్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి.
Also Read : GERD : తిన్న ఆహారం జీర్ణమవ్వక పుల్లని త్రేన్పులు వస్తున్నాయా.. ఈ సమస్య ఉందేమో..

టీబీఐ..

టీబీఐ..

బ్రెయిన్‌పై ఎక్కువగా దెబ్బ తగలడాన్ని ట్రామెటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ(TBI) అంటారు. దీని వల్ల సాధారణ బ్రెయిన్ పనితీరుకి ఆగిపోతుంది. స్వీడన్‌లోని Umea యూనివర్శిటీ పరిశోధకులు చేసిన మరో అధ్యయనం కూడా TBI డెమెన్షియాకి కారణంగా మారుతుందని చెబుతున్నారు. దెబ్బ తగిలిన మొదటి సంవత్సరంలో డెమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది

డెమెన్షియా లక్షణాలు..

డెమెన్షియా లక్షణాలు..

NHS UK ప్రకారం, డెమెన్షియా వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

వాంతులు
మతిమరుపు
తీవ్రమైన తలనొప్పి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మీకు తలకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే విదంగా ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *