Saturday, July 24, 2021

తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు… ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు… ఏం తేల్చారంటే…

National

oi-Srinivas Mittapalli

|

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు గురువారం(మార్చి 4) ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వట్టిదేనని తేలిపోయింది. తాజ్‌మహల్ లోపల,పరిసరాల్లో ఎక్కడా ఎటువంటి బాంబు లేదని పోలీసులు నిర్దారించారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సతీష్ గణేశ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. అతని మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపిస్తోందన్నారు. ఎందుకిలా బెదిరింపు కాల్ చేశాడో ఆరా తీస్తున్నామన్నారు. సుమారు 45 నిమిషాల పాటు తాజ్‌మహల్‌లో ముమ్మర తనిఖీల తర్వాత తిరిగి పర్యాటకులను అనుమతించినట్లు చెప్పారు. బాంబు లేదని తేలిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా,తాజ్‌మహల్‌లో బాంబు పెట్టినట్లు గురువారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఇటీవలి మిలటరీ నియామకాల్లో అవకతవకలు జరగడం తనను బాధించిందని… ఆ కారణంతోనే బాంబు దాడికి పాల్పడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు.దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పర్యాటకులను ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్స్‌, డాగ్‌ స్క్వాడ్స్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అక్కడ ఎలాంటి బాంబు లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన ఆ వ్యక్తిని ఫిరోజాబాద్‌లోని కస్‌గంజ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు.

ఉదయం 9గంటలకు తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు కాల్ రాగా… ఆ సమయంలో దాదాపు వెయ్యి మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరినీ హుటాహుటిన బయటకు తరలించారు. ఉదయం 11.15గంటల సమయంలో మళ్లీ పర్యాటకులను అనుమతించారు. బాంబు బెదిరింపు కాల్‌తో ఆందోళన చెందిన పర్యాటకులు… అంతా వట్టిదేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం కొన్ని వేల మంది దేశీ,విదేశీ పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిరంతరం సీఐఎఎస్ఎఫ్ భద్రత ఉంటుంది.


Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe