నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది మాత్రమే మంచి సక్సెస్ అనుకుంటూ రాణిస్తున్నారు. ఇక అన్నగారి తర్వాత బాలయ్య బాబు నందమూరి నటవరసత్వాన్ని కొనసాగించి.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. కాగా నందమూరి మూడవ జనరేషన్ హీరోగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాణిస్తున్న సంగతి` తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఆడపాదడపా సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ టైగర్ గా ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతో దూసుకుపోతున్నాడు. చివరిగా దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఊహించిన రేంజ్‌లో కలెక్షన్లు రాకున్న.. తన నెక్స్ట్ సినిమాతో సత్తా చాటుకుని సంచలనాలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇక మరో పక్క బాలయ్య.. వరుసగా సూపర్ సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదవ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకునేందుకు కష్టపడుతున్నాడు. బాలయ్య ఆరుపదల వయసులోనూ ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తూ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఎప్పటినుంచో ఈ బాబాయ్ కొడుకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యాన్స్ అంత తారక్ కంటే.. బాలయ్య బాబు గ్రేట్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం విశేషం. బాలయ్య తన పూర్తి కెరీర్‌లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హీట్లను సొంతం చేసుకున్నాడు.
తారక్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సరైన ఇండస్ట్రియల్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ బాలయ్య కంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే తారక్, బాలయ్య అభిమానుల మధ్యన వార్ మొదలైంది. ఒకప్పటి బాలయ్య బాబును బీట్ చేయడం ఎవరి వల్ల కాదంటూ బాలయ్య అభిమానులు ఘాటుగా రియాక్ట్ అవుతుంటే.. తారక్ అభిమానులు.. ఆయనను తలుచుకుంటూ.. ఎలాంటి రికార్డులైనా బ్రేక్ చేయగలడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఇలాంటి చీలికలు రావడం బాలయ్య, తారక్ అభిమానుల కోల్డ్ వార్‌కు కారణమవుతున్నాయి. మరి.. ఇకపై అయినా ఇద్దరు కలిసి నందమూరి ఫ్యామిలీ బాధ్యతలు ముందుకు తీసుకువెళ్తారా.. లేదా.. వేచి చూడాలి.