తారక్ కెరీర్ లో ఎన్ని ఇండస్ట్రియల్ హిట్లు వదులుకున్నాడో తెలుసా..?

Date:

Share post:


టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోను ఎంట్రీ ఇవ్వనన్నాడు. అంతేకాదు.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు.. దేవర 2 కూడా తారక్ లైనప్‌లో ఉంది. ఇక.. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా ప్రారంభించనున్నాడు.

Kick Telugu Movie Review Ravi Teja Ileana Surender Reddy

ఇక కెరీర్ పరంగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న తారక్.. తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసాడు అంటూ న్యూస్‌ వైరల్ అవుతుంది. డేట్లు కాళీ లేవని.. కొన్ని షూటింగ్స్ లో బిజీగా ఉండడం.. కథలు నచ్చకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడట.

16 Years for Arya: Some of the interesting facts about the Allu Arjun  starrer

అలా.. ఇప్పటివరకు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రవితేజ హీరోగా తెర‌కెక్కిన కిక్, సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన ఆర్య, వి.వి.వినాయక్ డైరెక్షన్లో నితిన్ హీరోగా నటించిన దిల్, బోయపాటి డైరెక్షన్‌లో రవితేజ నటించిన భద్ర, నాగార్జునతో ఊపిరి, కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే, రామ్ చరణ్ – బన్నీ.. నటించిన ఎవడు, రవితేజ నటించిన కృష్ణ సినిమాల అన్నింటికి మొదట హీరోగా ఎన్టీఆర్‌నే భావించారట.

Watch Dil (Telugu) (Telugu) Full Movie Online | Sun NXT

కిక్ లో కామెడీ ఎక్కువగా ఉండడంతో రిజెక్ట్ చేసిన తారక్.. ఆర్య కథ నచ్చిన అప్పటికే పలు లవ్ స్టోరీస్ వచ్చేసి ఉండడంతో దానిని రిజెక్ట్ చేశాడు. బోయపాటి.. భద్ర క‌థ న‌చ్చిన డేట్లు అడ్జస్ట్ కాక వదులుకున్నారు. ఇలా.. ఒక్కో సినిమాకు ఒక్కో కారణంతో ఈ బ్లాక్ బస్టర్ సినిమాలన్నింటిని ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ ఈ సినిమాలన్నింటిలోనూ నటించి ఉంటే మరిన్ని బ్లాక్ బస్టర్లు త‌న ఖాతాలో ప‌డేవంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...