Monday, November 29, 2021

తిరిగి కాంగ్రెస్ గూటికేనా?: కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన రేవంత్ రెడ్డి, కీలక మంతనాలు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్, జూనియర్, కొత్త, పాత అనే తేడా లేకుండా అందరు నాయకులను కలుపుకుపోతున్నారు. ఇంటి దొంగలను వదిలిపెట్టనంటూనే.. పార్టీలోకి వచ్చేవారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలను కలిసిన రేవంత్ రెడ్డి.. తాజాగా చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

కొండాతో తాజా రాజకీయ పరిస్థితిపై రేవంత్ చర్చలు

కొండాతో తాజా రాజకీయ పరిస్థితిపై రేవంత్ చర్చలు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయినప్పటికీ.. ఇంత వరకు ఏ పార్టీలోనూ చేరలేదు.

కొండా విశ్వేశర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారా?

కొండా విశ్వేశర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారా?

ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికే రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఇంటికి వెళ్లారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రేవంత్ రెడ్డి రెడ్డి ఆహ్వానిస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికేనా?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికేనా?

తొలుత టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ ఇమడలేకపోయారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరలేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి భేటీ కావడంతో విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Source link

MORE Articles

AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5...

Roborock Cyber Monday deals: Get a robot vacuum on the cheap today only!

A robot vacuum is one of the best investments you can make for your home. A good one can clean up your place...

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe