Thursday, June 17, 2021

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడే… అన్ని ఏర్పాట్లు పూర్తి… ఓట్లను ఎలా లెక్కిస్తారంటే…?

Telangana

oi-Srinivas Mittapalli

|

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ బుధవారం(మార్చి 17) జరగనుంది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు.

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో,వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానానికి నల్గొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తామని.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారని… ఈ పక్రియ పూర్తయ్యేందుకు సాయంత్రం అవుతుందని చెప్పారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్‌పై 40 కట్టలు(1000 ఓట్లు) పెడుతామన్నారు. మొత్తం 8 హాళ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.ఒక్కో హాల్‌లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Telangana MLC polls results: All arrangements set for counting

బుధవారం సాయంత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారని.. మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తారని చెప్పారు. ఫోన్లు, ఇతర సామాగ్రితో వచ్చే పార్టీల ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించమన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కాగా,ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా ఉండదు. మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే ఆ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే.. ఎలిమినేషన్ పద్దతిని అనుసరిస్తారు.

అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి ఎలిమినేట్ చేసి… అతనికి పోలైన ఓట్లలో ప్రాధాన్యత ప్రకారం ఆ ఓట్లను మిగతా అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. ఒకవేళ అప్పటికీ ఎవరికీ 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే… అందరికన్నా తక్కువ ఓట్లు పోలైన మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేసి మళ్లీ అలాగే ఓట్లు పంపిణీ చేస్తారు. తుది ఫలితం వచ్చేంతవరకూ ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు-కృష్ణా, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా నేడే జరగనుంది.


Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe