Tuesday, April 13, 2021

తేయాకు కార్మికురాలిగా .. అసోం ఎన్నికల ప్రచారంలో టీ ఎస్టేట్ లో ప్రియాంకా గాంధీ సందడి

టీ గార్డెన్ లో తేయాకులు కోస్తూ సందడి చేసిన ప్రియాంకా గాంధీ వాద్రా

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ని గద్దె దించాలని ప్రియాంక గాంధీ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న యువ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అసోం లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ కార్మికుల్లో కార్మికురాలి గా కలిసిపోయారు. టీ గార్డెన్ లో తేయాకులు కోస్తూ కార్మికుల తో కలిసి పని చేశారు.

బిస్వానాథ్‌లోని ఒక టీ ఎస్టేట్ సందర్శించిన ప్రియాంక గాంధీ వాద్రా టీ గార్డెన్ కార్మికులతో సంభాషించేటప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీ విధానాన్ని అనుసరించారు.

కార్మిక జీవనాన్ని తెలుసుకున్న ప్రియాంకా .. వారి ప్రేమ మరచిపోలేనని కితాబు

కార్మిక జీవనాన్ని తెలుసుకున్న ప్రియాంకా .. వారి ప్రేమ మరచిపోలేనని కితాబు

తన సందర్శనలో, ప్రియాంక కేవలం కార్మికులతో సంభాషించడమే కాదు, ఒక బుట్టను కూడా తీసుకొని టీ ఆకులను సేకరించటం ప్రారంభించారు. టీ ఎస్టేట్ వద్ద, ప్రియాంక కార్మికులతో వారి అనుమానాలు , భయాలు, వారి ఆశలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి సంభాషించారు. టీ గార్డెన్ సందర్శించిన తరువాత ప్రియాంక గాంధీ వాద్రా కార్మికుల నుండి తనకు లభించిన ప్రేమను మరచిపోలేనని చెప్పారు.

టీ గార్డెన్ కార్మికుల జీవితం సత్యం మరియు సరళతతో నిండి ఉందన్నారు. వారి నిరాడంబర జీవితాన్ని ప్రశంసించారు.

రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న ప్రియాంకా గాంధీ

రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న ప్రియాంకా గాంధీ

వారి శ్రమ దేశానికి ఎంతో విలువైనదని , ఈ రోజు, నేను వారి పని మరియు కుటుంబ శ్రేయస్సు గురించి మాట్లాడానన్నారు. వారి జీవితంలోని ఇబ్బందులను గ్రహించాను అని ప్రియాంక గాంధీ వాద్రా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మద్దతుదారులు ప్రియాంక గాంధీ వాద్రా టీ గార్డెన్ కార్మికులతో హృదయపూర్వకంగా సంభాషించే చిత్రాలను పంచుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా తన రెండు రోజుల అసోం పర్యటన రెండవ రోజు గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్యా ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఆమె తన పర్యటనను ప్రారంభించారు.

 మార్చి 27 న జరగనున్న అసోం ఎన్నికలు .. పట్టు కోసం కాంగ్రెస్ నేతల పాట్లు

మార్చి 27 న జరగనున్న అసోం ఎన్నికలు .. పట్టు కోసం కాంగ్రెస్ నేతల పాట్లు

గోహపూర్‌లోని మహిళా టీ గార్డెన్ కార్మికులు, స్వయం సహాయక బృంద సభ్యులతో కూడా ఆమె సంభాషించారు.

ప్రియాంక గాంధీ వాద్రా యొక్క రెండు రోజుల పర్యటన మార్చి 27 న జరగబోయే అసోం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాగుతుంది. ఆమె తన పర్యటనలో మూడు జిల్లాల్లోని నియోజకవర్గాలు – బిశ్వనాథ్ జిల్లా, సోనిత్పూర్ జిల్లా మరియు గౌహతిలలో పర్యటించారు. ఈ నియోజకవర్గాలలో మొదటిదశలో ఎన్నికలు జరగనున్నాయి.


Source link

MORE Articles

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

नवरात्रि के व्रत में अगर खाएंगे ये चीजें तो नहीं होंगे डिहाइड्रेशन के शिकार

नवरात्रि शुरू हो गए हैं. इन दिनों बहुत से लोग नौ दिनों तक व्रत रखते हैं. इन दिनों मां दुर्गा के नौ स्वरूपों...

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ – ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

పసుపు కండువా తలకట్టుతో జూనియర్.. ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్...

Weight Loss Tips: जीरा और दालचीनी, किचन के ये 2 मसाले तेजी से वजन घटाने में करेंगे मदद

नई दिल्ली: जब बात मोटापा कम करने की आती है तो ज्यादातर लोग डाइटिंग (Dieting) करने लग जाते हैं और सोचते हैं कि...

Romance: ఆఫీసులో డబుల్ కాట్ బెడ్, నాటుకోడి ఆంటీతో ఇన్స్ పెక్టర్ సరసాలు, ఐఏఎస్ ఎంట్రీతో !

చెన్నై/ బెంగళూరు: రెవెన్యూ శాఖ అధికారి కామంతో రగిలిపోయాడు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ అధికారికి కార్యాలయం కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాన్ని ఆ అధికారి అతనికి ఎలా కావాలో అలా మార్చుకున్నాడు....

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe