Thyroid Diet: ప్రస్తుత కాలంలో థైరాయిడ్‌ తీవ్రమైన సమస్యగా మారుతోంది. NCBI నివేదిక ప్రకారం, భారతదేశంలో 42 మిలియన్ల మంది థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ల కంటే.. స్త్రీలలో థైరాయిడ్‌ వచ్చే ముప్పు 10 రెట్లు ఎక్కువ. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారని అంచనా. థైరాయిడ్‌ హార్మోన్‌ సవ్యంగా విడుదలైనప్పుడే.. శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఆ హార్మోన్ విడుదలలో సమతుల్యం లోపిస్తే సమస్యలు తప్పవు. థైరాయిడ్‌ సమస్య రెండు రకాలు ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు హైపర్‌ థైరాయిడిజం అంటారు. దీనిలో థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. థైరాయిడ్‌ గ్రంథి తక్కువగా పని చేస్తున్నప్పుడు ‘హైపో థైరాయిడిజం’ అంటారు. శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ పోషకహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా అన్నారు. థైరాయిడ్‌ సమస్యను నియంత్రించడానికి సహాయపడే కొన్ని ఆహార పదార్థాలను మనకు షేర్‌ చేశారు.

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజలలో జింక్, సెలీనియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి. గుమ్మడి గింజల్లోని జింక్‌ T4ని యాక్టివ్‌ T3గా మార్చడానికి సహాయపడుతుంది. మీరు థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతుంటే.. ప్రతి రోజూ గుమ్మడి విత్తనాలు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా అన్నారు. ఈ గింజలో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుందని, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. (image source – pixabay)

Also Read:ఈ గింజలు రోజూ ఒక స్పూన్‌ తింటే.. పీసీఓఎస్‌ లక్షణాలు తగ్గుతాయ్..!

కరివేపాకు..

కరివేపాకు..

కరివేపాకులో రాగి పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాక్సిన్‌ హార్మోన్‌ T4 ఉత్పత్తిని పెంచుతుంది. శరీరంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది, రక్త కణాలలో T4 అధికంగా శోషించకుండా చేస్తుంది. కరివేపాకులోని విటమిన్లు, మినరల్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడం, ఆకలి, బలహీనత వంటి థైరాయిడ్‌ లక్షణాలను పరిష్కరిస్తుంది. కరివేపాకులో టానిన్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన హెపాటో – ప్రొటెక్టివ్‌గా పని చేసి.. ఆహారాన్ని జీవక్రియ చేయడంలో థైరాయిడ్ గ్రంధికి ఇన్‌డైరెక్ట్‌గా సహాయపడుతుంది.

(image source – pixabay)

సబ్జా..

సబ్జా..

వేసవిలో వేడికి చెక్‌ పెట్టడానికి చాలా మంది సబ్జా వాటర్‌ తాగుతూ ఉంటారు. సబ్జా గింజలు.. థైరాయిడ్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి. సబ్జా గింజల్లో.. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ థైరాయిడ్‌ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ జీవక్రియను మెరుగుపరుస్తాయి. సబ్జాలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది.. ఇది మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. సబ్జా గింజల్లోని పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ వంటి మినరల్స్‌ థైరాయిడ్‌ లక్షణాలను కంట్రోల్‌లో ఉంచుతాయి. (image source – pixabay)

Also Read:ఈ గింజలతో.. సోరియాసిస్‌ లక్షణాలు త్వరగా తగ్గుతాయ్..!

తోటకూర గింజలు..

తోటకూర గింజలు..

తోటకూర గింజల్లో సెలీనియం మెండుగా ఉంటుంది. ఇది T4ని T3గా మార్చడానికి అవసరం, ఎందుకంటే డియోడినేస్ ఎంజైమ్‌లు (T4 నుంచి అయోడిన్ అణువులను తొలగించే ఎంజైమ్‌లు) సెలీనియంపై ఆధారపడి ఉంటాయి.

(image source – pixabay)

పెసరలు..

పెసరలు..

పెసరల్లో థైరాయిడ్‌ మెండుగా ఉంటుంది. థైరాయిడ్ పనితీరుకు తగినంత మొత్తంలో అయోడిన్ అవసరం. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ట్రైఅయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4)థైరాయిడ్ హార్మోన్లలో అయోడిన్ ఉంటుంది. థైరాయిడ్‌ పేషెంట్స్‌ పెసరలు తీసుకుంటే మంచిది. (image source – pixabay)

పెరుగు..

పెరుగు..

పెరుగు అయోడిన్ గొప్ప మూలం. ఇది ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్ కూడా, పెరగు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్య ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా సంభవిస్తాయి. మీ ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవడానికి.. పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. (image source – pixabay)

Also Read:వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషకాలు కచ్చితంగా తీసుకోవాలి..!

దానిమ్మ..

దానిమ్మ..

దానిమ్మపండులో పాలీఫెనాల్స్ మెండుగా ఉంటాయి, ఇవి శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి, తద్వారా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. దానిమ్మ తరచుగా తీసుకుంటే.. థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. (image source – pixabay)

Also Read:దానిమ్మ తింటే.. గుండె జబ్బులు రావంట..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *