Wednesday, May 12, 2021

దక్షిణాదిలో ఒకే దెబ్బకు – బెంగాల్‌లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్

దక్షిణాదిలో ఒకే దెబ్బలో..

పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఈసీ ఇవాళ ప్రకటించిన షెడ్యూల్ లో పలు అనూహ్య అంశాలున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు(234 అసెంబ్లీ స్థానాలు), కేరళ(140 సీట్లు) పుదుచ్చేరి(30)లో కేవలం ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. అదే అస్సాంలో మాత్రం మూడు దశల్లో (మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్6న) పోలింగ్ జరుగనుండగా, పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఏకంగా 8 ఫేజుల్లో(మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 6, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 17, ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 26, ఏప్రిల్ 29న) ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇది ముమ్మాటికీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడమేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..

ఈసీ సమాధానం చెప్పగలదా?

ఈసీ సమాధానం చెప్పగలదా?

మిగతా రాష్ట్రాలకు భిన్నంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం ఎనిమిది విడతల్లో నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసోంలో మూడు విడతలుగా, తమిళనాడు, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తూ, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క జిల్లాలోనే రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే.. మోదీ-షా తాళానికి నాట్యం చేయడం మానుకోవాలని పరోక్షంగా చురకలు అంటించారు. ఈసీ షెడ్యూల్ ప్రకటన అనంతరం శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

బీజేపీ ఫాయిదా కోసమే 8ఫేజులు

బీజేపీ ఫాయిదా కోసమే 8ఫేజులు

‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందా? వాళ్ల ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? అస్సాం, తమిళనాడుల్లో తొందరగా ఎన్నికలు అవగొట్టుకుని, ఆ తర్వాత అందరూ కలిసి బెంగాల్ పై పడటానికే ఈ రకంగా షెడ్యూల్ రచించి ఉంటారు. అయితే, పాపం బీజేపీకి ఈ ఐడియా పెద్దగా కలిసిరాదు. ఎందుకంటే మోదీ-షాలతోపాటు మొత్తం బీజేపీకి మేం భారీ షాకివ్వబోతున్నాం…

దేశంలో ఏకైక మహిళా సీఎం

దేశంలో ఏకైక మహిళా సీఎం

బెంగాల్ లో మాత్రమే 8 విడతల్లో ఎన్నికలు ఒక ఎత్తయితే, రాష్ట్రంలోని ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటం విడ్డూరం కాక మరేంటి? చాలా జిల్లాల్లో రెండేసి విడతల్లో పోలింగ్ పెట్టారు. టీఎంసీకి గట్టి పట్టున్న సౌత్ 24 పరగణా జిల్లాలోనైతే ఏకంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తద్వారా మాకు వాళ్లు బీఏ పార్ట్ 1, పార్ట్ 2 పాఠాలు నేర్పిస్తున్నారు. ఏది ఏమైనా అసలైన ఆట ఇప్పుడే ఆరంభమైంది. మతాల ఆధారంగా మనుషుల్ని విభజించే బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమైపోయింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రినైన నన్ను బెంగాలీ మహిళలే తిరిగి గెలిపిస్తారు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు..

బెంగాల్ పోల్ షెడ్యూల్‌పై రచ్చ

బెంగాల్ పోల్ షెడ్యూల్‌పై రచ్చ

భారత ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు శుక్రవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా బెంగాల్ షెడ్యూల్ పై బీజేపీ అనుకూల, వ్యతిరేకుల మధ్య రచ్చ కొనసాగుతోంది. రెండేళ్ల కిందటి లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే తీరుగా దక్షిణాదిలో ముందే ఎన్నికలు పూర్తయి, బెంగాల్ లో మాత్రం భారీ ప్రహాసనంగా ప్రక్రియ జరిగిన తీరు బీజేపీకి లాభించిన విషయం చర్చకు వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఉద్ధండుల ప్రచారం, డబ్బుల పంపిణీకి అనుగుణంగానే షెడ్యూల్ విడుదలైందని మమతా బెనర్జీ కూడా ఆరోపిస్తున్నారు.


Source link

MORE Articles

Illegal affair: భర్తకు నైట్ డ్యూటీ, భార్య ఫుల్ బిజీ, గొడదూకిన ప్రియుడు, ఫ్రెండ్స్ చూసి ?

పెద్దలు డిసైడ్ చేసిన పెళ్లి తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని సెల్లూర్ గ్రామానికి చెందిన విమల్ రాజ్ (30), కొటై గ్రామానికి చెందిన రేష్మా (23)...

Xiaomi Is No Longer on US Blacklist

(Photo: Xiaomi) Back in January and before President Trump left office, Chinese electronics company Xiaomi was added to a blacklist...

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో భాగంగా కొత్త కంపెనీలు కూడా తమ వాహనాలను...

మిస్టర్ జగన్ రెడ్డి: లండన్‌లో సైకాలజీ ఆసుపత్రికి ఎందుకెళ్లారు?: నాకో కండోమ్స్ కావాలి: రఘురామ

మద్యం దుకాణాలెందుకు? కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. ప్రజలను మద్యానికి బానిస చేసేలా వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. పొరుగునే ఉన్న ఒడిశా,...

पुरुष रात को सोने से पहले करें दूध के साथ इस चीज का करें सेवन, फिर जो होगा यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: अगर आप शारीरिक कमजोरी के शिकार है और काम करते वक्त जल्दी थक जाते हैं तो ये खबर आपके काम आ...

These two iPhone 12 Pro deals are some of the cheapest yet on the EE network

iPhone 12 Pro deals aren't exactly affordable, standing out as one of the most expensive handsets Apple has ever made. With that in...

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి...

Onion Benefits: सुबह उठकर करें कच्चे प्याज का सेवन, मिलेंगे यह जादुई फायदे!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं प्याज के फायदे. भारत का शायद ही ऐसा कोई घर हो जहां प्याज (Onion...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe