దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?

Date:

Share post:


టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఫిదా చేస్తూ వచ్చాడు. అంతేకాదు.. తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు మోత మోగిస్తున్నాడు జక్కన్న. ఇక.. చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన జక్కన్న.. ఈ సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం దక్కించుకున్నారు.

Rajanna Movie Child Artist Annie Present: Know Interesting Facts About Her  - Sakshi

ఇక జక్కన్న నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వ‌ర‌ల్డ్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసిన రాజమౌళి హీరో, హీరోయిన్లు, విలన్.. ఇలా ప్రతి క్యారెక్టర్ విషయంలోనూ ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీస్ జక్కన్న సినిమాల్లో తమకు కూడా అవకాశం వస్తే బాగుంటుందంటూ ఎదురుచూస్తున్నారు. అంతలా నటీనటులంతా గొప్పగా చూసే రాజమౌళికి.. ఓ యంగ్ హీరోయిన్ నటన అంటే చాలా ఇష్టం అట‌. గతంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విష‌యం వెల్లడించాడు.

Rajanna Movie Child Artist Baby Annie Latest Photos - Sakshi

ఇంతకీ ఆ అక్కి గర్ల్‌ ఎవరో కాదు. రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన అనీ. ఇక ఈ సినిమా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందగా.. యాక్షన్ సీన్స్ కు రాజమౌళి దర్శకత్వం వహించాడు. కాగా చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అనీ నటనకు తను ఫిదా అయినట్లు జక్కన్న వివరించాడు. సినిమాలోని ఓ పెద్ద సీన్ పెద్దవాళ్ళు కూడా కష్టంగా నటిస్తారు. ఆ సీన్‌ను ఎంతో ఈజీగా అనీ చేసేసింది. కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్ల కాదు.. కానీ ఆ అమ్మాయి కళ్ళతోనే ఎమోషన్స్ పండించేసింది అంటూ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు రాజ‌మౌళి కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...