Tuesday, May 24, 2022

దీపంలా ఉండాలని అమ్మ చెప్పింది -సీఈసీగా అందరినీ సంతోషపెట్టలేను -సునీల్ అరోరా చివరి మాటలు

National

oi-Madhu Kota

|

”ఒక ప్రదేశంలో వెలుగునిచ్చే దీపం ఎవరితోనూ సంబంధం కలిగి ఉండదు. నిజంగా పని చేసేవారికి మర్యాదపూర్వక సంభాషణ ఎలాగైతే తెలీదో, దీపానిదీ అదే తీరు.. ఈ వాక్యాన్ని నా చిన్నతనం నుంచి మా అమ్మ చాలా సార్లు చెప్పింది. 1989లో క్యాన్సర్ వ్యాధితో తాను చనిపోయింది. ఆమె మాటలు మాత్రం నన్నింకా నడిపిస్తున్నాయి. అయితే, నా ప్రయాణం కూడా ముగింపు దశకు వచ్చింది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చీఫ్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)గా ఇదే నా చివరి ప్రెస్ మీట్.. ” అంటూ భావోద్వేగానికి గురయ్యారు సునీల్ అరోరా.

దక్షిణాదిలో ఒకే దెబ్బకు – బెంగాల్‌లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఈసీ సునీల్ అరోరా తన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా పంచుకున్నారు. సీఈసీ హోదాలో శుక్రవారం నాటిదే చివరి ప్రెస్ మీట్ అన్న ఆయన.. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయబోతున్నట్లు తెలిపారు. అమ్మ చెప్పినట్లుగానే జీవితాంతం నడుచుకున్న తాను.. వృత్తిపరంగా సంతృప్తితో రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

Cant make all happy, says cec sunil Arora in his last press meet, remembers his mother

”నా పదవీకాలంలో మొత్తం 11 మేజర్ ఎన్నికలను నిర్వహించాను. వాటిలో అతి ప్రధానమైనది 2019 లోక్ సభ ఎన్నికలు. అయితే, కరోనా విలయకాలంలో నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నా కెరీర్ లో చారిత్రకమైనవిగా భావిస్తాను. ఎన్నికల కమిషనర్ గా నా ఇన్నింగ్స్ బాగుందని మీరంతా(మీడియా) భవిస్తుండొచ్చు. నా వరకైతే ఎలాంటి రిగ్రెట్స్ లేవు. అయితే.. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్ విషయంలో అందరినీ సంతోషపెట్టలేను” అని అరోరా వ్యాఖ్యానించారు.

Cant make all happy, says cec sunil Arora in his last press meet, remembers his mother

జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..

పంజాబ్ లోని హోషియాపూర్ లో 1956, ఏప్రిల్ 13న జన్మించిన సునీల్ అరోరా పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ తర్వాత సివిల్స్ సాధించారు. రాజస్థాన్ కేడర్ 1980వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా అనేక పదవులు నిర్వహించి రిటైరైన ఆయన.. 2017, సెప్టెంబర్ 1న ఎన్నికల సంఘంలో కమిషనర్ గా చేరారు. ఓంప్రకాశ్ రావత్ పదవీకాలం ముగియడంతో 2018 డిసెంబర్ 2న అరోరా సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్ సభ ఎన్నికలు, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని, కమలనాథుల విద్వేషవ్యాఖ్యలపై చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారని అరోరాపై ఆరోపణలున్నాయి. ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe