Tuesday, September 21, 2021

దుబ్బాకలో విషాదం: ఇంటికొస్తున్నానని తల్లికి యువకుడికి ఫోన్.. ఇంతలోనే ఊహించని షాక్


Telangana

oi-Srinivas Mittapalli

|

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు… తిరిగొస్తున్నానని ఫోన్ చేసి… ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అతని మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది తెలియరాలేదు.

వివరాల్లోకి వెళ్తే… సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన నవకాంత్ అనే యువకుడు ఈ నెల 3న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు శ్రీరాం రవిశేఖర్,జ్యోతి దంపతులు కుమారుడు నవకాంత్‌ కోసం దుబ్బాక పరిసర ప్రాంతాల్లో వెతికారు. బంధుమిత్రులకు ఫోన్ చేసి నవకాంత్ ఆచూకీ గురించి ఆరా తీశారు. అయినా లాభం లేకపోయింది.

dubbaka youth committed suicide on railway track near kamareddy

కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గత ఐదు రోజులుగా తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆదివారం(ఫిబ్రవరి 7) నవకాంత్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. తాను ఇంటికొచ్చేస్తున్నానని చెప్పిన నవకాంత్… తల్లిదండ్రులు ఆందోళన పడవద్దని చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రుల మనసు కాస్త కుదుటపడింది. కానీ ఇంతలోనే వారికి ఊహించని వార్త ఎదురైంది.

కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై నవకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో వారి గుండె పగిలినంత పనైంది. కొద్ది గంటల క్రితమే ఫోన్ చేసి ఇంటికి తిరిగొస్తున్నానని చెప్పినవాడు ఇలా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో వారికి అర్థం కాలేదు. కుమారుడి మరణవార్త విని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నవకాంత్ జేబులో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా అతని చిరునామా గుర్తించి సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.



Source link

MORE Articles

భారత్ కు బిగ్ రిలీఫ్ .. బాగా తగ్గిన కరోనా కొత్త కేసులు, మరణాలు; తగ్గిన యాక్టివ్ కేసులు.. లెక్కలివే !!

బాగా తగ్గిన యాక్టివ్ కేసులు .. గణనీయంగా పెరుగుతున్న రికవరీలు భారతదేశంలో యాక్టివ్ కేసులు 3,09,575 వద్ద ఉన్నాయి. ఇది 184 రోజుల్లో అత్యల్పంగా ఉంది. క్రియాశీల...

Alzheimer’s Disease: इस लाइलाज बीमारी की शुरुआत में मिलने लगते हैं ये संकेत, तुरंत उठाएं ये कदम

Alzheimer's Day: 21 सितंबर को पूरे विश्व में वर्ल्ड अल्जाइमर डे (World Alzheimer's Day 2021) के रूप में मनाया जाता है. यह एक...

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield కంపెనీ తీసుకువచ్చిన ఈ కార్యక్రమం అతి తక్కువ కాలంలోనే చాలా ఆదరణ పొందగలిగింది. కంపెనీ ఇప్పుడు ఇందులో ఇప్పుడు రైడర్ జాకెట్స్ కూడా అందించనున్నట్లు తెలిపింది....

ఇండియాలో కొత్త 2021 Ducati Monster కోసం బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే లాంచ్!

ఈ కొత్త 2021 డ్యుకాటి మోన్‌స్టర్ బైక్ కోసం కంపెనీ బుకింగ్ లను ప్రారంభించడంతో పాటుగా, తమ సోషల్ మీడియా హ్యాండిల్‌ లో ఇందుకు సంబంధించిన ఓ టీజర్...

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe