దూసుకెళ్లిన నిఫ్టీ, సెన్సెక్స్‌ – వరుసగా రెండో రోజు డబ్బుల వర్షం!

[ad_1]

Stock Market Closing 18 January 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 112 పాయింట్ల లాభంతో 18,165 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 52 పైసలు బలపడి 81.24 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,655 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,716 వద్ద మొదలైంది. 60,569 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద ముగిసింది.

news reels

NSE Nifty

మంగళవారం 18,053 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,074 వద్ద ఓపెనైంది. 18,032 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,183 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 112 పాయింట్ల లాభంతో 18,165 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,271 వద్ద మొదలైంది. 42,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,555 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 229 పాయింట్లు పెరిగి 42,458 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, ఎల్‌టీ, యూపీఎల్‌, విప్రో షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఒక శాతానికి పైగా పతనమైంది. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.




[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *