టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలనడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచాలను సృష్టించింది. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మెల్లమెల్లగా సినిమాపై పాజిటివ్ టాక్ రావడం ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు తరలి వెళ్లడంతో సినిమా మంచి రిజల్ట్స్ అందుకుంది. ఈ క్రమంలోనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వశూళ్ళు కొల్లగొట్టింది. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓటీటీలో సైతం 9 వారాలపాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.
కాగా.. ఈ సినిమా క్లైమాక్స్‌లో పార్ట్ 2 క్లిప్ హ్యాంగర్ని వదిలాడు కొరటాల. కన్న కొడుకే దేవరను ఎందుకు చంపాడనేది పార్ట్ 2 లో చూపించనున్నట్లు హింట్ ఇచ్చాడు. అయితే.. తర్వాత కొంత కాలం పాటు సెకండ్ పార్ట్ ఉండదంటూ వార్తలు వినిపించినా.. తారక్ తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. ఇదే సినిమా స్పెషల్ అనౌన్స్మెంట్ కోసం వీడియోను రూపొందిస్తున్నారని.. త్వరలోనే ఈ వీడియోతో పార్ట్ 2 పై క్లారిటీ ఇవ్వబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ నెల 20న వీడియో రిలీజ్ కోసం టీం కష్టపడుతున్నారు.
దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాకున్న.. ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రాజెక్ట్ పై అసలు అంచనాలను పెట్టుకోవడం లేదు. ఇది అసలు వర్కౌట్ అయ్యే సినిమా కాదని.. మొదటి భాగం కేవలం తారక్ కోసం అనిరుధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ వల్ల సక్సెస్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో దేవర పార్ట్ 2 పై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు తెచ్చేలా.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా గ్లింప్స్ వీడియోను ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. దీంతో సినిమాపై మరింత హైప్ పెరుగుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.