
Telangana Govt: ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి పోస్టర్ ను ఆవిష్కరించారు. అదేవిధంగా గ్రాట్యుటీని రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Raed: చనిపోయాక ఏం జరుగుతుంది?.. ఇదిగో ఈమె చూసిందట.. ఏం చెబుతుందో వినండి..
సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాల్లో పనిచేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అకాల మరణం చెందితే అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఇచ్చే రూ.20వేలను రూ.30వేలకు ప్రభుత్వం పెంచింది.
దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు మరణానంతరం లేదా పదవీ విరమణ తరువాత చెల్లించే గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అర్చకులు, ఉద్యోగులకు ఆర్థిక భద్రతను, భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది.