Tuesday, August 3, 2021

దేశంలో ఉత్తమ ఐటీ మంత్రిగా కేటీఆర్: రెండోసారి స్కోచ్ అవార్డు, తెలంగాణ బెస్ట్ స్టేట్

Telangana

oi-Rajashekhar Garrepally

|

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)కు మరో అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా కేటీఆర్ నిలిచారు. ఈ మేరకు స్కోచ్ గ్రూప్.. మంత్రి కేటీఆర్ కు ప్రశంసా పత్రం అందించింది.

2020 సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్‌గా ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ వెల్లడించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు స్కోచ్ గ్రూప్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కేటీఆర్‌కు అందజేశారు. రాష్ట్రానికి రెండు అవార్డు లభించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభంలోనూ మెరుగైన ప్రజా సేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికతను విరివిగా వినియోగించుకుంది. 2016లో కూడా మంత్రి కేటీఆర్ స్కోచ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే రెండు సార్లు స్కోచ్ అవార్డు దక్కించుకున్న ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ రికార్డు సృష్టించారు.

స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ మంత్రి కేటీఆర్ తోపాటు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఐటీ సేవలను అందించడం కొనసాగించాలని చెప్పారు. కరోనా కాలంలో ఐటీ సేవలను విస్తృతంగా వినియోగించారని అభినందించారు.

కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎంగా స్కోచ్ అవార్డు అందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గవర్నెన్స్ విభాగంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.

స్కోచ్ గ్రూప్ మనదేశంలో ఫైనాన్స్, టెక్నాలజీ, ఎకనామిక్స్, సాంఘిక రంగాల్లో అత్యున్నత స్వతంత్ర పౌర పురస్కారాలను ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తుంది. భారత్‌ను మరింత మెరుగైన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రజలు, ప్రాజెక్టులు, సంస్థలకు ఈ పురస్కారాలను అందజేస్తుంది.
Source link

MORE Articles

Remove the blackness of underarms: किचन में रखी इन चीजों से चुटकियों में हटेगा अंडरआर्म्स का कालापन, जानिए आसान तरीका

how to remove dark underarms: ज्यादातर महिलाएं अंडरआर्म्स का कालापन (blackness of underarms) छिपाने के लिए बिना आस्तीन के कपड़े पहनने से बचती...

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

మోడీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్: అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా...

Benefit of banana health: रोज 1 केला सेहत के लिए कर सकता है कमाल, बस जान लीजिए सेवन का सही टाइम

benefit of banana health: आज हम आपके लिए केला के फायदे लेकर आए हैं. केला सबसे ज्यादा एनर्जी देने वाला फल है. खास...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe