News

lekhaka-Bhusarapu Pavani

|

SBI:
దేశంలో
అత్యంత
లాభదాయకమైన
సంస్థ
రిలయన్స్
ఇండస్ట్రీస్
అని
తెలిసిందే.
తర్వాతి
స్థానంలో
ఉన్నదేంటో
తెలుసా?
అతిపెద్ద
రుణదాతగా
పేరుగాంచిన
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియానే.
FY23లో
రిలయన్స్
తర్వాత
అత్యంత
లాభదాయక
సంస్థగా
SBI
అవతరించింది.
గత
మూడేళ్ల
ఆదాయాల్లో
41
శాతం
వృద్ధిని
కనబరచడమే
ఇందుకు
కారణం.

అధిక
నికర
వడ్డీ
ఆదాయం
మరియు
తక్కువ
ఖర్చుల
వల్ల
2022-2023
ఆర్థిక
సంవత్సరానికి
నికర
లాభం
57
శాతం
YoY
పెరిగి
55
వేల
648
కోట్లకు
చేరుకుంది.
తాజాగా
విడుదల
చేసిన
Q4
ఫలితాల్లో

మేరకు
SBI
ప్రకటించింది.
ఆసక్తికరమైన
మరో
విషయం
ఏంటంటే..
రిలయన్స్
ఇండస్ట్రీస్
మినహా
మరే
ఇతర
భారతీయ
కంపెనీ
లాభాలు
50
వేల
కోట్ల
మార్కు
దాటలేదు.

దేశంలో రెండో అత్యంత లాభదాయక సంస్థగా SBI.. మొదటి, మూడు స్థానా

66
వేల
702
కోట్ల
నికర
లాభంతో
రిలయన్స్
ఇండస్ట్రీస్
అగ్ర
స్థానంలో
కొనసాగుతోంది.
అనంతరం
55
వేల
648
కోట్లతో
SBI
రెండో
స్థానంలో
నిలిచింది.
కాగా
45
వేల
997
కోట్లతో
HDFC
బ్యాంక్
మూడో
స్థానంతో
సరిపెట్టుకోవాల్సి
వచ్చింది.
అయితే
మే
29న
Q4
ఫలితాలు
ప్రకటించాల్సి
ఉన్న
ONGC
నికర
లాభం
48
వేల
కోట్లుగా
ఉంటుందని
బ్లూమ్‌
బెర్గ్
అంచనా
వేసింది.

ఫలితాలపై
SBI
ఛైర్మన్
దినేష్
కుమార్
ఖరా
స్పందించారు.
ఆయా
సెగ్మెంట్‌లలో
బ్యాంకుకు
క్రెడిట్
వృద్ధి
బలంగా
ఉందన్నారు.
విదేశీ
కార్యాలయాలు
మంచి
పనితీరును
కొనసాగించాయని,
సంవత్సరాలుగా
ఆస్తుల
నాణ్యత
మెరుగుపడిందని
పేర్కొన్నారు.
స్థూల
NPA
నిష్పత్తి
గత
10
ఏళ్ల
కనిష్ఠానికి
పడిపోయినట్లు
చెప్పారు.
గత
త్రైమాసికం
నాటికి
3.14
శాతం
ఉన్న
స్థూల
NPA
నిష్పత్తి
2023
మార్చి
చివరి
నాటికి
2.78
శాతానికి
తగ్గినట్లు
తెలిపారు.

English summary

SBI stood second as the most profitable after Reliance Industries

SBI stood second as the most profitable after Reliance Industries

Story first published: Friday, May 19, 2023, 8:35 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *