Fibe Axis Bank Numberless Credit Card: మనలో చాలా మంది దగ్గర క్రెడిట్‌ కార్డ్‌లు ఉన్నాయి, వాటిపై 16 అంకెల నంబర్‌ ఉంటుంది. మరి, నంబర్‌ లేని క్రెడిట్‌ కార్డ్‌ మీ దగ్గర ఉందా?, యాక్సిస్ బ్యాంక్ దానిని లాంచ్‌ చేసింది.

భారతదేశంలో మొట్టమొదటి నంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ను తీసుకురావడానికి యాక్సిస్ బ్యాంక్‌, ఫైబ్‌ (గతంలోని పేరు ఎర్లీ శాలరీ) చేతులు కలిపాయి. ఈ కార్డ్ అందరి కోసం కాదు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తరం కోసం లాంచ్‌ చేశాయి. సంప్రదాయ కార్డులతో పోలిస్తే అదనపు సెక్యూరిటీ లేయర్‌తో (నంబర్లు లేకుండా) వచ్చిన తొలి క్రెడిట్ కార్డ్ ఇది. 

నంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ కాబట్టి, చూసే వాళ్లకు ఈ కార్డ్‌ మీద నంబర్‌ కనిపించదు. అలాగే ఈ కార్డ్ మీద ఎటువంటి ఎక్స్‌పైరీ డేట్‌ లేదా CVV నంబర్ ఉండదు. కాబట్టి, ఈ కార్డ్ తన వివరాలను & యజమాని గుర్తింపును బయట పెట్టదు. ఒకవేళ కార్డును మీరు పోగొట్టుకుని, అది విద్రోహుల చేతుల్లోకి వెళ్లినా… చట్టవిరుద్ధమైన ఉపయోగం అవకాశాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ కార్డును ఎవరైనా దొంగిలించినా మీ డబ్బును, గోప్యతను రక్షించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. కార్డ్‌పై నంబర్ లేకపోతే, కస్టమర్ వివరాలను కనిపెట్టలేరు.

ఫైబ్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?
ఈ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి.. దాని వివరాలు (నంబర్‌, సీవీవీ వంటివి) తెలుసుకోవాలంటే పెద్ద పనేం కాదు, టెక్నాలజీ గురించి కాస్త తెలిసుంటే చాలు. ఫైబ్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివరాలను Fibe యాప్‌ ద్వారా సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్‌లో మీ గురించి కొద్దిగా సమాచారాన్ని అందిస్తే, కార్డుపై నియంత్రణ పూర్తి పూర్తిగా మీ చేతుల్లోకి వస్తుంది. ఇది కో-బ్రాండెడ్ (Fibe – Axis) క్రెడిట్ కార్డ్‌ కాబట్టి దీనిలో చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

ఫైబ్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీచర్లు, ప్రయోజనాలు
అన్ని రకాల రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లపై 3% క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
ప్రముఖ రైడ్‌ యాప్స్‌ ద్వారా ఇండియాలో ప్రయాణాలు చేస్తే 3% క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్స్‌ నుంచి 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
అన్ని ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ లావాదేవీలపై 1% క్యాష్‌బ్యాక్ కస్టమర్లు పొందుతారు.
ఈ కార్డ్‌ ద్వారా సంవత్సరానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ ఉంటుంది. 
రూ. 400-రూ. 5,000 మధ్య ఫ్యూయల్‌ బిల్లులపై ఫ్యూయల్‌ సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది.

బ్యాంక్ వెబ్‌సైట్‌ ప్రకారం, క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని ఒక నెలలో గరిష్టంగా 1500 రూపాయలకు పరిమితం చేశారు.

క్రెడిట్ కార్డ్‌ను UPIకి లింక్ చేసే సౌకర్యం
ఈ కొత్త క్రెడిట్ కార్డ్ రూపే (RuPay) ద్వారా అందుతుంది. కాబట్టి మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్‌లకు లింక్ చేసుకోవచ్చు, వివిధ రకాల చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు. అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా లావాదేవీలు జరగడమే కాకుండా, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ కార్డ్‌తో చెల్లించవచ్చు. కస్టమర్ల సౌలభ్యం కోసం, ‘ట్యాప్ అండ్‌ పే’ (tap and pay) ఫీచర్‌ కూడా ఈ కార్డ్‌లో ఉంది.

కార్డ్ జాయినింగ్ ఫీజ్‌ & యాన్యువల్‌ ఫీజ్‌
ఈ కార్డ్ పూర్తిగా ఉచితం. జీరో జాయినింగ్ ఫీజు & జీరో యాన్యువల్‌ ఫీజ్‌తో తీసుకోవచ్చు, ఈ సదుపాయం జీవితకాలం అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌ Fibe కస్టమర్‌లకు యాప్‌లో అందుబాటులో ఉంటుందని Fibe ప్రకటించింది.

మరో ఆసక్తికర కథనం: లక్ష రూపాయల MRF షేర్‌ను రూ.10 వేలకు కూడా కొనొచ్చు, కొత్త కాన్సెప్ట్‌ గురూ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *