టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఒక పక్కన నటుడుగానే కాదు.. ప్రొడ్యూసర్‌గాను వరుస సక్సెస్‌లు అందుకుంటూ కోట్లు కూడబెడుతున్న నాని.. మొదట ఇండస్ట్రీ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న క్రమంలోనే.. అష్ట చమ్మ సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. పక్కింటి కుర్రాడులా నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. అప్పటినుంచి నాని కెరీర్‌లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు.
అయితే నాని హీరోగా ట్రై చేసిన క్రమంలో ఎన్నో అవమానాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందట. అంతే కాదు.. హీరోగా మారి హిట్ అందుకుని స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా.. ఆయనతో నటించేందుకు హీరోయిన్స్ నో చెప్పేసేవారట. అలా.. నాని నటించిన ఎంసీఏ సినిమా రిజల్ట్ తర్వాత నాని పలు సినిమాలతో వరుస ఫ్లాప్‌లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మూమెంట్‌లో ఓ హీరోయిన్ నానితో సినిమా చేసేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడుసార్లు రిజెక్ట్ చేసింది. ఆమె మరి ఎవరో కాదు రష్మిక మందన.
నేషనల్ క్రష్‌గా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక.. నానితో నటించడానికి ఒకటి కాదు, రెండు కాదు, మూడు సార్లు అవకాశం వచ్చినా నో చెప్పేసిందట. అయితే ఈ మూడు సార్లు ఆమె ఎవో చెత్త రిజన్స్‌తో సినిమాని రిజెక్ట్ చేసిందంటూ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం నాని.. రష్మికను మించిపోయ్యే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా భిట్3తో బ్లాక్ బస్టర్ అందుకొని కలెక్షన్ పరంగా సంచలనాలు సృష్టించాడు. ఈ క్రమంలోనే నాని పేరు మారు మోగిపోతుంది. ఇప్పటికైనా రష్మిక లాంటి స్టార్ హీరోయిన్స్ బ్యాక్ గ్రౌండ్ కాకుండా.. అతనిలో టాలెంట్ ను చూసి సినిమాలో నటిస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.